ఇకపై మనీ ట్రాన్ఫర్‌కు నో ఛార్జస్

ముంబై: డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఇకపై నగదును పెద్దమొత్తంలో బదిలీ చేయడానికి వినియోగించే ఆర్టీజీఎస్‌(రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌), నెఫ్ట్‌( నేషనల్ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్‌) ఛార్జీలను ర‌ద్దు చేసింది. ఇది జులై 1వ తేది నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఆర్టీజీస్‌లో అయితే ఎక్కువ మొత్తంలో, నెఫ్ట్‌ విధానంలో 2 లక్షల వరకు నగదును బదిలీ చేసుకోవచ్చు. గతంలో ఆర్టీజీఎస్‌ పద్ధతిలో సొమ్ము బదిలీకి […]

ఇకపై మనీ ట్రాన్ఫర్‌కు నో ఛార్జస్
RTGS Services
Follow us

|

Updated on: Jul 01, 2019 | 4:38 AM

ముంబై: డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఇకపై నగదును పెద్దమొత్తంలో బదిలీ చేయడానికి వినియోగించే ఆర్టీజీఎస్‌(రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌), నెఫ్ట్‌( నేషనల్ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్‌) ఛార్జీలను ర‌ద్దు చేసింది. ఇది జులై 1వ తేది నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఆర్టీజీస్‌లో అయితే ఎక్కువ మొత్తంలో, నెఫ్ట్‌ విధానంలో 2 లక్షల వరకు నగదును బదిలీ చేసుకోవచ్చు.

గతంలో ఆర్టీజీఎస్‌ పద్ధతిలో సొమ్ము బదిలీకి రూ.5 నుంచి రూ.50, నెఫ్ట్‌ పద్ధతిలో రూ.1 నుంచి రూ.5 వసూలు బ్యాంకులు వసూలు చేసేవి. ప్రస్తుత చర్యతో డిజిటల్‌ బ్యాంకు లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని ‘భారత బ్యాంకు సమాఖ్య’ ఛైర్మన్‌ సునీల్‌ మెహతా పేర్కొన్నారు