Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

అధికారమే పరమావధి.. అయితే ..!

Rahul Gandhi, అధికారమే పరమావధి.. అయితే ..!

కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామా ఫైనల్ అని ప్రకటించిన రాహుల్ గాంధీ.. నాలుగు పేజీలతో కూడిన సుదీర్ఘమైన లేఖను,, ట్వీట్లతో బాటు విడుదల చేశారు. దీన్ని తమ పార్టీ కార్యకర్తలకు రిలీజ్ చేసిన ఓపెన్ లెటర్ గా భావిస్తున్నారు. ఈ లేఖలో ఆయన.. ఈ దేశంలో అధికారం కోసం తహతహలాడుతున్నవారి వైఖరిని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.
‘ ఇండియాలో ఇదో అలవాటుగా మారింది. అదే ! అధికారాన్ని అంటిపెట్టుకున్నవారు దాన్ని వదలలేరు. అలాగే అధికారాభిలాష ఉంటే..దాన్ని పణంగా పెట్టకుండా ప్రత్యర్థులను ఓడించలేం. ఈ ఏడాదిలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నాను. ఇన్నాళ్లూ పార్టీకి సేవలు చేయవలసి రావడం నాకు గౌరవప్రదమని భావిస్తున్నాను. పార్టీ విలువలు, సిధ్ధాంతాలు మన దేశానికి ఆయువు పట్టయ్యాయి. ఈ దేశానికి, నా పార్టీకి ఎంతో రుణపడి ఉంటాను. మన పార్టీకి జవాబుదారీ అన్నది ఇప్పుడే కాదు..భవిష్యత్తులో కూడా ఎంతో ముఖ్యం. అందుకే రాజీనామా చేశాను. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి పలువురిని జవాబుదారీని చేయాల్సి ఉంది. అయితే నా బాధ్యతను పక్కనబెట్టి ఇతరులను జవాబుదారీని చేయలేను. అది సముచితం కాదు కూడా. పార్టీ కొత్త నేతను ఎన్నుకోవాలని నా సహచరులు చాలామంది కోరారు. కానీ అది కరెక్ట్ కాదు. మన పార్టీకి ఎంతో చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరచి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని చాలాసార్లు కోరాను ‘ అని రాహుల్ పేర్కొన్నారు.
ఇక… బీజేపీ పట్ల నాకు ద్వేషం లేదు.. అయితే దేశం పట్ల వారి పోకడను నా దేహంలో ప్రతిభాగం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇది కొత్త పోరాటం కాదు.. వేలాది ఏళ్లుగా మనగడ్డపై కొనసాగుతోంది. ద్వేషం ఉన్న చోట నేను ప్రేమను పంచాను.. ఈ రోజు బీజేపీ ఒక పథకం ప్రకారం ప్రజల వాణిని నొక్కేస్తోంది. ఈ గొంతులను మనం మళ్ళీ ఉత్తేజపరచి ఏకం చేయాల్సి ఉంది. ఈ బాధ్యత పార్టీ పై ఉంది. ప్రధాని ఈ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన.. అది ఆయనపై వఛ్చిన అవినీతి ఆరోపణలు తప్పని నిరూపించజాలదు.. అధికారకాంక్ష ఇండియాలో ఊహించలేని  హింసకు కారణమవుతోంది. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గిరిజనులు, దళితులు, మైనార్టీలు ఎన్నో బాధలు పడాల్సి వస్తోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ ప్రతిష్ఠ మసకబారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏమైనా కాంగ్రెస్ పార్టీకి నా సేవలు నిరంతరం ఉంటాయి.. జై హింద్.. అంటూ రాహుల్ తన లేఖను ముగించారు.

Related Tags