నురుగు కాదు కాలుష్యం.. ముంచుకొస్తున్న ముప్పుకు సంకేతం!

అందమైన చెన్నై తీరాన్ని ఇప్పుడు తెల్లటి నురుగు కమ్మేసింది. కిలోమీటర్ల మేర ఈ నురుగు ప్రవహిస్తోంది. చెన్నైని కాలుష్య భూతం కమ్మేసిందని.. దానికి ఇది నిదర్శనమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కెమికల్ కంపెనీలు వ్యర్థాల్ని సముద్రంలోకి వదిలేయడంతో ఇలా జరుగుతోందని తెలిపారు. చెన్నై అనగానే మెరీనా బీచ్ గుర్తుకు వస్తుంది. ఓ వైపు భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతోంటే.. మెరీనా బీచ్ ను మాత్రం తెల్లని నురగ కమ్మేసింది. దీన్ని ముంచుకొస్తున్న ముప్పుకు సంకేతంగా చెప్పుకోవాలి. ఈ నురుగును […]

నురుగు కాదు కాలుష్యం.. ముంచుకొస్తున్న ముప్పుకు సంకేతం!
Follow us

| Edited By:

Updated on: Dec 04, 2019 | 2:49 AM

అందమైన చెన్నై తీరాన్ని ఇప్పుడు తెల్లటి నురుగు కమ్మేసింది. కిలోమీటర్ల మేర ఈ నురుగు ప్రవహిస్తోంది. చెన్నైని కాలుష్య భూతం కమ్మేసిందని.. దానికి ఇది నిదర్శనమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కెమికల్ కంపెనీలు వ్యర్థాల్ని సముద్రంలోకి వదిలేయడంతో ఇలా జరుగుతోందని తెలిపారు. చెన్నై అనగానే మెరీనా బీచ్ గుర్తుకు వస్తుంది. ఓ వైపు భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతోంటే.. మెరీనా బీచ్ ను మాత్రం తెల్లని నురగ కమ్మేసింది. దీన్ని ముంచుకొస్తున్న ముప్పుకు సంకేతంగా చెప్పుకోవాలి. ఈ నురుగును చూడటానికి భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు. కానీ ఇది కాలుష్యం నుంచి పుట్టిన నురుగు. భారీ వర్షాల కారణంగా డ్రైనేజీ నీరు సముద్రంలో కలుస్తోంది. నగర శివారులోని కెమికల్ ఫ్యాక్టరీలు వ్యర్థాలను సముద్రంలోకి వదులుతున్నాయి. మూడేళ్ళ క్రితం కూడా భారీ వర్షాలు పడ్డాయి కానీ అప్పుడు ఈ నురుగు కనిపించలేదని తెలుస్తోంది. ఆ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.