లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం.. ఇక నగరంలో రోడ్డు ఎక్కారో..

కరోనా మహమ్మారి కేసులు ఎక్కువవుతుండటంతో.. కేంద్రం సీరియస్ యాక్షన్‌కు రెడీ అయ్యింది. ఇక లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు ఇక లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా దాదాపు రెండు లక్షల వాహనాలపై కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఒక్క రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే 50వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన […]

లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం.. ఇక నగరంలో రోడ్డు ఎక్కారో..
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 7:30 PM

కరోనా మహమ్మారి కేసులు ఎక్కువవుతుండటంతో.. కేంద్రం సీరియస్ యాక్షన్‌కు రెడీ అయ్యింది. ఇక లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు ఇక లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా దాదాపు రెండు లక్షల వాహనాలపై కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఒక్క రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే 50వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటి వరకు రోడ్ల మీదికి వస్తున్న అనుమానాస్పద వాహనదారుల.. వెహికిల్స్‌ సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. ఇకపై అలా వచ్చిన వాహనాలపై ట్రాఫిక్‌ చలానాతో పాటు.. సదరు వాహనదారున్ని స్థానిక పోలీసులకు అప్పగించనున్నారు. స్థానిక పోలీసులు సదరు వాహనదారుడిపై ఐపీసీ 188, 271, 188, ప్రాణంతక వ్యాధులు, ప్రాణాలకు ముప్పు, క్వారంటైన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి పలు అంశాల కింద కేసులు నమోదు చేసి.. జైలుకు పంపనున్నారు. గరిష్టంగా రెండేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.