Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని నివాసంలో సుదీర్గంగా సాగిన కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం. మోడీ పాలన రెండవ విడత లో ఏడాది పూర్తయిన తరువాత తొలిసారి జరిగిన కేబినెట్ భేటీ. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. మద్యాహ్నం 3 గంటలకు కేబినెట్ నిర్ణయాలు ప్రకటించనున్న కేంద్రమంత్రులు. దేశ ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్,చైనా భారత్ సరిహద్దు వివాదం అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
  • జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో 3 మంది ఉగ్రవాదులు మృతి.
  • కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. తిరువనంతపురంలో భారీ వర్షం. వాతావరణ శాఖ అంచనాల మేరకు కదులుతున్న రుతుపవనాలు. రెండు వారాల్లో దక్షిణాది మొత్తం విస్తరించే అవకాశం.
  • చెన్నై : కోలీవుడ్ లో ముదురుతున్న గాడ్ మాన్ వెబ్ సిరీస్ వివాదం. గాడ్ మాన్ వెబ్ సిరీస్ ట్రైలర్,టీజర్ ని విడుదల చేసిన నిర్మాణ సంస్థ . ట్రైలర్ లో బ్రహ్మనులను కించపరుస్తూ సంభషణలు ,సన్నివేశాలుండడం ఫై బీజేపీ నేతలు,హిందూ సంఘాలు ఆగ్రహం . నిర్మాణ సంస్థ ,దర్శకుడి ఫై పోలీసులకు ఫిర్యాదు ,6 సెక్షన్ లలో కేసు నమోదు చేసిన పోలీసులు . ట్రైలర్ ,టీజర్ లను యూట్యూబ్ నుండి తొలగించిన నిర్మాణ సంస్థ.
  • ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్. 2 వారాల క్రితం ముంబై నుండి డిల్లీకి వచ్చిన ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైంటిస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సైoటిస్ట్. ICMR HQ లలో సమావేశం కోసం ఢిల్లీ కి వచ్చినట్లు అధికారులు వెల్లడి. భవనాన్ని శాని టైజేషన్ చేస్తున్న అధికారులు.

‘ఆర్ఆర్ఆర్’ స్క్రిప్టులో మార్పులు…!

Rajamouli Doing Changes In RRR Script, ‘ఆర్ఆర్ఆర్’ స్క్రిప్టులో మార్పులు…!

కరోనా లాక్‌డౌన్ వ‌ల్ల ఏర్పడిన‌‌ పరిస్థితుల నుంచి తేరుకునేందుకు టాలీవుడ్ కు ప్రభుత్వం తన‌ వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇప్పటికే సినిమాల పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ చేసుకోవ‌డానికి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌గా..షూటింగులు జూన్​లో మొదలయ్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తుది దశ చిత్రీకరణలో ఉన్న సినిమాలన్నీ సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాయి.

అయితే షూటింగ్స్ కు గ‌వ‌ర్న‌మెంట్ ప‌ర్మిష‌న్ ఇచ్చినా.. మునుపటిలా చిత్రీకరణలు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అందుకే పలు మూవీ యూనిట్స్ తమ కథల్లో చిన్న, చిన్న మార్పులు చేసుకుంటున్నాయి. ఆ చిత్రాల జాబితాలో జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తోన్న‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా ఉన్నట్లు సమాచారం. రాజమౌళి ఇప్పటికే ఈ మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్​ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయ‌డానికి మూహుర్తం ఫిక్స్ చేశారు. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల వ‌ల్ల‌ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అనే అనుమానులు సినీ ప్రేమికుల్లో నెల‌కున్నాయి. కానీ, రాజమౌళి మాత్రం చెప్పిన తేదీకే మూవీని థియేటర్స్ లోకి తీసుకురావాల‌ని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసుకుంటున్నారట. భారీ ఫైట్‌ సీక్వెన్స్, అవుట్‌ డోర్‌ షెడ్యూల్ స‌న్నివేశాల‌‌ విషయంలో ఈ మార్పులు ఉండనున్నట్లు స‌మాచారం. వీలైనంత వరకు తక్కువ మందితో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా మిగిలిన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే 80 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబ‌ట్టి.. ఇప్పుడు చేసే మార్పులు కథపై పెద్దగా ఎఫెక్ట్ చూపవని మూవీ టీమ్ ధీమాతో ఉన్నట్లు సమాచారం.

Related Tags