ధోని.. నీవే నాకన్నీ : హార్దిక్‌ పాండ్య

మహేంద్రసింగ్‌ ధోనీ.. ఈ భారత వికెట్ కీపర్ రేంజ్ వేరు. అన్ని ఫార్మాట్లలో టీంను అగ్రపథాన నిలబెట్టిన ఒకప్పటి ఇండియన్ కెప్టెన్. ఐపీఎల్‌లోనూ చెన్నై టీంకు అత్యదిక సార్లు కప్‌ను అందించిన సారథి.  నేటి తరం యువ క్రికెటర్లు ఎందరికో ఈయన ఆదర్శం. అభిమానులు ముద్దుగా కెప్టెన్‌ కూల్‌, తలా అని పిలుచుకునే మహి.. తన లెజెండ్‌ అని అంటున్నాడు ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు హార్దిక్‌ పాండ్య. ఐపీఎల్‌ 12వ సీజన్‌ క్వాలిఫయర్‌ 1లో చెన్నై సూపర్‌ […]

ధోని.. నీవే నాకన్నీ : హార్దిక్‌ పాండ్య
Follow us

|

Updated on: May 08, 2019 | 4:55 PM

మహేంద్రసింగ్‌ ధోనీ.. ఈ భారత వికెట్ కీపర్ రేంజ్ వేరు. అన్ని ఫార్మాట్లలో టీంను అగ్రపథాన నిలబెట్టిన ఒకప్పటి ఇండియన్ కెప్టెన్. ఐపీఎల్‌లోనూ చెన్నై టీంకు అత్యదిక సార్లు కప్‌ను అందించిన సారథి.  నేటి తరం యువ క్రికెటర్లు ఎందరికో ఈయన ఆదర్శం. అభిమానులు ముద్దుగా కెప్టెన్‌ కూల్‌, తలా అని పిలుచుకునే మహి.. తన లెజెండ్‌ అని అంటున్నాడు ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు హార్దిక్‌ పాండ్య.

ఐపీఎల్‌ 12వ సీజన్‌ క్వాలిఫయర్‌ 1లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ తలపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చపాక్‌ స్టేడియంలో ధోనీతో ఉన్న ఓ ఫొటోను హార్దిక్‌ పాండ్య ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘నా స్ఫూర్తి, నా స్నేహితుడు, నా సోదరుడు, నా లెజెండ్‌ ఈయనే.. ఎంఎస్‌ ధోనీ’ అని పాండ్య ట్వీట్ చేశారు. దీంతో పాటు ధోనీ హెలికాప్టర్‌ షాట్లను గుర్తుచేస్తూ హెలికాప్టర్‌ ఇమోజీని పెట్టాడు.

మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌ 1లో చెన్నైపై ముంబయి ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో తడబడిన చెన్నై సొంత మైదానంలో ఆశించిన మేర రాణించలేకపోయింది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో చెన్నై శుక్రవారం క్వాలిఫయర్‌ 2 ఆడనుంది. అందులో గెలిస్తే ఫైనల్‌కు దూసుకెళ్తుంది.

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!