2 కేజీల ఇసుకను దొంగలించినందుకు 86వేల ఫైన్‌

చుట్టపుచూపుగా ఓ ప్రదేశానికి వెళ్లిన ఓ టూరిస్ట్‌.. తిరిగి వెళ్లేటప్పుడు ఊరికే వెళ్లాలనిపించలేదో ఏమో కాబోలు అక్కడి నుంచి ఇసుకను తీసుకెళ్లాలనుకున్నాడు

2 కేజీల ఇసుకను దొంగలించినందుకు 86వేల ఫైన్‌
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2020 | 7:08 AM

Tourist fine for Sand: చుట్టపుచూపుగా ఓ ప్రదేశానికి వెళ్లిన ఓ టూరిస్ట్‌.. తిరిగి వెళ్లేటప్పుడు ఊరికే వెళ్లాలనిపించలేదో ఏమో కాబోలు అక్కడి నుంచి ఇసుకను తీసుకెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలో దాదాపుగా రెండు కేజీల ఇసుకను తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. ఇక ఇంటికి వెళుతుండగా ఆ టూరిస్ట్‌ను ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అడ్డుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఇసుకను తీసుకెళ్తున్నట్లు గమనించిన వారు అతడికి ఫైన్ వేశారు. ఏదో వంద, రెండు వందలు కాదు.. రెండు కేజీల ఇసుక కోసం దాదాపు రూ.86వేల జరిమానాను విధించారు. చదవడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. నిజంగా మీరు చదివేది నిజమేనండి.

వివరాల్లోకి వెళ్తే.. ఫ్రెంచ్‌కి చెందిన ఓ టూరిస్ట్‌ ఇటీవల మెడిటేర్రనియన్ సీమ్‌లోని అతిపెద్ద ఇటాలియన్ ఐల్యాండ్‌ సర్దేనియాకు వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక బాటిల్ నిండా ఇసుకను తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఎల్‌మాస్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. ఇసుకను గమనించిన అధికారులు వెయ్యి యూరోలను ఫైన్‌గా వేశారు.

కాగా సర్దేనియా ప్రాంతంలోని బీచ్‌ల్లోని ఇసుకను తీసుకురావడం నేరం. ఒకవేళ అక్కడి ఇసుకను దొంగతనం చేసి దొరికితే ఒకటి నుంచి ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్షను విధిస్తుంటారు. గతంలోనూ ఓ ఫ్రెంచ్ జంట 14 ప్లాస్టిక్ బాటిళ్ల ఇసుకను(40కేజీలు) అక్కడి నుంచి దొంగలించి తీసుకెళ్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. వీరికి ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించారు.

Read More:

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు

ఆటోమొబైల్ రంగానికి గుడ్‌న్యూస్ చెప్పిన నితిన్ గడ్కరీ