కరుడుగట్టిన అల్‌ఖైదా ఉగ్రవాది హతం

అల్‌ఖైదా పేరుచెబితే చాలు.. ఎంత క్రూరమైన ఉగ్రసంస్థనో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒసామా బిన్ లాడెన్‌ కూడా ఈ ఉగ్ర సంస్థకు చెందిన వాడే.

కరుడుగట్టిన అల్‌ఖైదా ఉగ్రవాది హతం
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 7:11 PM

అల్‌ఖైదా పేరుచెబితే చాలు.. ఎంత క్రూరమైన ఉగ్రసంస్థనో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒసామా బిన్ లాడెన్‌ కూడా ఈ ఉగ్ర సంస్థకు చెందిన వాడే. ఈ ఉగ్రసంస్థకు చెందిన టెర్రరిస్టులతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో అనేక దేశాలు ఈ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదుల గురించి వేటాడుతున్నాయి. తాజాగా ఓ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని ఫ్రాన్స్‌ బలగాలు హతమార్చాయి. అల్‌ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ను.. నార్త్‌ అల్జీరియాలోని పర్వత ప్రాంతాల్లో ఉన్నట్లు ఫ్రెంచ్‌ సైన్యం గుర్తించింది. దీంతో వెంటనే ఫ్రెంచ్ బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. స్థానిక సైన్యంతో కలిసి అబ్దుల్ మాలిక్‌ను మట్టుబెట్టాయి. నార్త్ మాలి, అల్జీరియా ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో అబ్దుల్ మాలిక్‌ హతమైనట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత ఏడేళ్లుగా ఈ ఉగ్రవాది కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.