ఏపీలో ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీకి జీవో

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నిరాశ్రయులైన బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీకి జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి సోమవారం ప్రభుత్వ జీవో విడుదల చేశారు. వారం పైగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఒక్కోక కుటుంబానికి 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామ్ ఆయిల్, కిలో […]

ఏపీలో ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీకి జీవో
Follow us

|

Updated on: Oct 19, 2020 | 1:31 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నిరాశ్రయులైన బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీకి జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి సోమవారం ప్రభుత్వ జీవో విడుదల చేశారు. వారం పైగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఒక్కోక కుటుంబానికి 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామ్ ఆయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు ఇవ్వలని పేర్కొన్నారు. వస్తువుల సరఫరాకు సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.