మంత్రి కేటీఆర్ ఔదార్యం…అక్ష‌య‌పాత్రతో ఉచిత భోజ‌నం

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో తెలంగాణ లాక్ డౌన్‌ తో రాష్ట్రం స్తంభించిపోయింది. ర‌వాణా, వ్యాపార స‌ముదాయాలు ఎక్క‌డిక‌క్క‌డే తాళాలు ప‌డ్డాయి. దీంతో రోజువారీగా కూలిప‌నులు చేసుకునేవాళ్లు, రెక్కాడితే గానీ, డొక్కాడిని ఎంతో మంది అభాగ్యులు ఆక‌లితో అల్లాడిపోతున్నారు. వారంద‌రినీ దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ..

మంత్రి కేటీఆర్ ఔదార్యం...అక్ష‌య‌పాత్రతో ఉచిత భోజ‌నం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 26, 2020 | 3:02 PM

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో తెలంగాణ లాక్ డౌన్‌ తో రాష్ట్రం స్తంభించిపోయింది. ర‌వాణా, వ్యాపార స‌ముదాయాలు ఎక్క‌డిక‌క్క‌డే తాళాలు ప‌డ్డాయి. దీంతో రోజువారీగా కూలిప‌నులు చేసుకునేవాళ్ల బాధ‌లు మాత్రం అన్నీఇన్నీ కావు.. రోజూ ప‌నికి వెళ్తేనే పూట‌గ‌డిచే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దీంతో రెక్కాడితే గానీ, డొక్కాడిని ఎంతో మంది అభాగ్యులు ఆక‌లితో అల్లాడిపోతున్నారు. అంతేకాదు, అనాథ‌లు, దిక్కులేని వారంద‌రినీ దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు అలాంటి వారంద‌రి ఆక‌లిని తీర్చేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో అక్ష‌య‌పాత్ర‌ను అందుబాటులోకి తెచ్చింది.

నిరుపేద‌లు, అన్నార్తుల ఆకలి తీర్చేందుకు రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాలను యథాతథంగా కొనసాగించ‌నుంది. అంతేగాకుండా.. ఈ అన్న‌పూర్ణ కేంద్రాల్లో ఉచితంగా పేద‌ల‌కు భోజ‌నం అంద‌జేయ‌నుంది. ఈ మేరకు ఆయా కేంద్రాలు ఇవాళ్టి నుంచే అందుబాటులోకి తీసుకువ‌చ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ అక్ష‌య‌పాత్ర సెంట‌ర్ల ద్వారా సుమారుగా రోజుకు 40వేల మందికి ఆకలి తీర్చనున్న అక్షయ పాత్ర టర్ హైద‌రాబాద్‌లోని 150 అన్నపూర్ణ కేంద్రాల వద్ద పేద‌ల‌కు ఉచితంగా భోజనం అంద‌జేయ‌నున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ ఆకలితో బాధపడవద్దన్న ఉద్దేశంతోనే మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. అలాగే.. హాస్టళ్లలో ఉండే వారు, వర్కింగ్‌ పర్సన్‌లకు జీహెచ్‌ఎంసీ తరపున ఉచితంగా భోజన సదుపాయం కల్పించ‌నున్న‌ట్లు తెలిపారు.

మ‌రోవైపు..రేష‌న్ స‌ప్లై కోసం సివిల్ సప్లేయస్ హెల్ప్ లైన్ సెంటర్ల‌ను ఏర్పాటు చేశారు. రేష‌న్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కి రూ. 1500లు ఇస్తామ‌ని ప్ర‌కటించింది ప్రభుత్వం. దీంతో ఆ రూ.1500 ఎలా ఇస్తారు అనే గందరగోళంలో ఉన్న ప్ర‌జ‌లు హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌కు ఫోన్లు కొడుతున్నారు. దీంతో వేల‌కాల్ప్ మోగిపోతుండ‌గా, న‌గ‌దు రావాలంటే ప్రత్యేక ఫామ్ కావాలి అన్న పుకార్లను కొట్టి పడేస్తున్నారు అధికారులు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మాదిరిగానే అకౌంట్‌లో న‌గ‌దు జ‌మ‌చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. గ్యాస్ కనెక్షన్లు లేనివారికి ఆధార్ లింక్ ఉన్న అకౌంట్ కి నేరుగా వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రెండు రోజుల్లో ఖాతాల్లోకి డ‌బ్బు చేరుతుంద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేసిన‌ట్లుగా స‌మాచారం.

తెలంగాణ వ్యాప్తంగా పేద‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా వారికి అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌రాల‌ను తీర్చేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా ప‌ర్య‌వేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. అలాగే.. మంత్రి కేటీఆర్ కూడా హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుంటూ వారికి భ‌రోసా ఇస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను వివ‌రిస్తూ లాక్‌డౌన్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని, సామాజిక దూరం ద్వారానే మ‌హ‌మ్మారి క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌ల‌ని సూచిస్తున్నారు. ప్ర‌జ‌లంతా సంయ‌మ‌నం పాటించి లాక్‌డౌన్ ను పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన