కేజ్రీవాల్.. కరెంట్‌కు ఇచ్చారండి ‘క్రేజీ’ నజరానా

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఢిల్లీవాసులకు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారీ నజరానా ప్రకటించారు. 200యూనిట్ల లోపు విద్యుత్ ఉపయోగించే వారికి ఉచిత విద్యుత్ వర్తింపజేస్తామని ఆయన తాజాగా ప్రకటించారు. అలాగే 201 యూనిట్ల నుంచి 400యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి బిల్లులపై 50శాతం రిబేట్‌ను ఇస్తామని కూడా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీ మాట్లాడుతూ.. ‘‘200యూనిట్లలోపు వినియోగానికి ఎలాంటి బిల్లు రాదు. పూర్తిగా ఉచితం. ఇది సామాన్యులకు మేలు చేసే చారిత్రాత్మక […]

కేజ్రీవాల్.. కరెంట్‌కు ఇచ్చారండి ‘క్రేజీ’ నజరానా
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 1:59 PM

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఢిల్లీవాసులకు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారీ నజరానా ప్రకటించారు. 200యూనిట్ల లోపు విద్యుత్ ఉపయోగించే వారికి ఉచిత విద్యుత్ వర్తింపజేస్తామని ఆయన తాజాగా ప్రకటించారు. అలాగే 201 యూనిట్ల నుంచి 400యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి బిల్లులపై 50శాతం రిబేట్‌ను ఇస్తామని కూడా ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కేజ్రీ మాట్లాడుతూ.. ‘‘200యూనిట్లలోపు వినియోగానికి ఎలాంటి బిల్లు రాదు. పూర్తిగా ఉచితం. ఇది సామాన్యులకు మేలు చేసే చారిత్రాత్మక నిర్ణయం’’ అని పేర్కొన్నారు. దీనివలన నగరంలో 33శాతం మంది లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. అయితే ఇటీవలే ఢిల్లీలో మహిళలందరికీ ఉచిత మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి తెస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చి విషయం తెలిసిందే.