ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షలు..

గ్రేటర్ హైదరాబాద్ లో నేటి నుంచి కొవిడ్-19 పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. తెలంగాణలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షలు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 16, 2020 | 9:59 AM

హైదరాబాద్ నగరంలో కోవిడ్-19 భారీగా విజృభిస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ వైరస్‌ కట్టడికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు (మంగళవారం) ఇవాళ్టి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎంపిక చేసిన వనస్థలిపురం, బాలాపూర్‌, కొండాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్‌ అయిన వారికి తొలి ప్రాధాన్యతగాా కొవిడ్-19 పరీక్షలు చేయనున్నారు.

ఒక్కో కేంద్రంలో రోజుకు 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే మొదటి దఫాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ టెస్టులను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో వీటిని పెంచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. త్వరలో ఫీవర్‌, కింగ్‌కోఠి, చెస్ట్‌, సరోజినీ ఆస్పత్రుల్లో కూడా  కొవిడ్-19 పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.