పాముతో స్కిప్పింగ్ ఆడిన పిల్లలు… వీడియో వైరల్!

పామును చూస్తే ఎవరికైనా భయమే. చూడగానే పారిపోతారు. కానీ, ఆ చిన్నారులు మాత్రం దాన్ని తాడులా పట్టుకుని స్కిప్పింగ్ ఆడారు. ఇది వింటుంటే ఒళ్లు జలదరిస్తోంది కదూ. వియత్నాంలో వింత ఘటన చోటుచేసుకుంది.ఆ పిల్లలు ఏ మాత్రం భయం లేకుండా పామును అటూ ఇటూ పట్టుకుని తాడును తిప్పినట్లు తిప్పారు. పిల్లలు అలా పాముతో ఆడుతుంటే వారించాల్సింది పోయి ఓ మహిళ.. వారిని ఎంకరేజ్ చేయడం ఇంకా విచిత్రం. అయితే, పామును పట్టుకున్న పిల్లలు ఏ మాత్రం […]

పాముతో స్కిప్పింగ్ ఆడిన పిల్లలు... వీడియో వైరల్!
Follow us

| Edited By:

Updated on: Nov 20, 2019 | 8:56 AM

పామును చూస్తే ఎవరికైనా భయమే. చూడగానే పారిపోతారు. కానీ, ఆ చిన్నారులు మాత్రం దాన్ని తాడులా పట్టుకుని స్కిప్పింగ్ ఆడారు. ఇది వింటుంటే ఒళ్లు జలదరిస్తోంది కదూ. వియత్నాంలో వింత ఘటన చోటుచేసుకుంది.ఆ పిల్లలు ఏ మాత్రం భయం లేకుండా పామును అటూ ఇటూ పట్టుకుని తాడును తిప్పినట్లు తిప్పారు. పిల్లలు అలా పాముతో ఆడుతుంటే వారించాల్సింది పోయి ఓ మహిళ.. వారిని ఎంకరేజ్ చేయడం ఇంకా విచిత్రం. అయితే, పామును పట్టుకున్న పిల్లలు ఏ మాత్రం భయం లేకుండా.. తాడుతో ఆడుతున్నట్లే పాముతో ఆడటం కనిపించింది. అయితే, అది చనిపోయిన పాము అని ఈ వీడియో పోస్టు చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది.