అయోధ్య ట్రస్ట్ సొమ్ములో రూ. 6 లక్షలు ‘విత్ డ్రా’, కేటుగాళ్ల చేతివాటం !

అయోధ్యలో శ్రీరామ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి మోసగాళ్లు ఫోర్జరీ చెక్కులతో 6 లక్షలు కాజేశారు. ట్రస్ట్ కార్యదర్శి చంపక్ రాయ్ ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రాథమికంగా..

అయోధ్య ట్రస్ట్ సొమ్ములో రూ. 6 లక్షలు 'విత్ డ్రా', కేటుగాళ్ల చేతివాటం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 10, 2020 | 6:41 PM

అయోధ్యలో శ్రీరామ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి మోసగాళ్లు ఫోర్జరీ చెక్కులతో 6 లక్షలు కాజేశారు. ట్రస్ట్ కార్యదర్శి చంపక్ రాయ్ ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేయగా ఇంత మొత్తాన్ని కాజేశారని వెల్లడైంది. ఈ నెల 1న 2.5 లక్షలు, 8 న 3.5 లక్షలను ఫ్రాడ్ స్టర్స్ ఫేక్ చెక్కులు, ఫేక్ సంతకాలతో  ఈ సొమ్మును విత్ డ్రా చేశారని పోలీసులు చెప్పారు. మూడోసారి నిన్న 9.86 లక్షలను కూడా ఇలాగే నకిలీ చెక్కులు, సంతకాలతో విత్ డ్రా చేయబోగా బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ..ట్రస్టుకు ఫోన్ చేశారని వారు తెలిపారు. చంపక్ రాయ్ బ్యాంకుకు చేరుకొని వెరిఫై చేయడంతో ఈ బాగోతం బయటపడింది. విత్ డ్రా చేసిన నగదును వారు పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు కనుగొన్నారు. కాగా ట్రస్ట్ ఖాతా ఉన్న బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కూడా కేటుగాళ్లు మోసానికి దోహదపడింది. క్లోనింగ్ చేసిన చెక్కులు, సంతకాలతో మోసగాళ్లు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు.