మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ కీ, తాజా ఘటనకీ లింక్ ఉందా ?

ఫ్రాన్స్ లోని నైస్ లో గల చర్చిలో ఓ ఉగ్రవాది కత్తితో జరిపిన దాడిలో ముగ్గురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఇద్దరి తలలను టెర్రరిస్టు దారుణంగా నరికివేశాడు.

  • Umakanth Rao
  • Publish Date - 5:09 pm, Thu, 29 October 20
మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ కీ, తాజా ఘటనకీ లింక్ ఉందా ?

ఫ్రాన్స్ లోని నైస్ లో గల చర్చిలో ఓ ఉగ్రవాది కత్తితో జరిపిన దాడిలో ముగ్గురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఇద్దరి తలలను టెర్రరిస్టు దారుణంగా నరికివేశాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని, చర్చిని, సమీప ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక ఇప్పటికే జరిగింది చాలునని, తమ భూభాగం నుంచి ఇస్లామో ఫాసిజాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే  శాంతి చట్టాలను విడనాడవలసిందేనని మేయర్ ఎస్ట్రోసీ ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. పారిస్ శివార్లలో ఇటీవల ఓ స్కూల్లో పేటీ అనే టీచర్ తలను చెచెన్ (చెచెన్యా) కి చెందిన ఓ టెర్రరిస్ట్ నరికివేశాడు. ఈ టీచర్ పిల్లలకు పాఠాలు చెబుతూ మహమ్మద్ ప్రవక్తపై గల కార్టూన్లను వారికి చూపినందుకే తాను హతమార్చానని ఆ ఉగ్రవాది తెలిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ ఘటన నుంచి పారిస్ ఇంకా తేరుకోక ముందే ఈ అమానుష కాండ జరిగింది. దానికీ, ఈ తాజా సంఘటనకూ లింక్ ఉన్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. తాము పవిత్రంగా భావించే మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్లను దైవ దూషణగా ముస్లిములు పరిగణిస్తారు.