మూడురోజులైనా జాడలేని చిన్నారి కీర్తి.. సోకసంద్రంలో పేరెంట్స్

చిన్నారి కీర్తి జాడ ఇంకా తెలియడంలేదు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్లలో మూడు రోజుల క్రితం కీర్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే. బాలిక కోసం తల్లితండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4వ పుట్టినరోజు నాడే కీర్తి కనిపించకుండా పోయింది. పుట్టినరోజు వేడుక కోసం కీర్తి తండ్రి కొత్త దుస్తులు, చాక్లెట్‌లు తెచ్చే సమయానికి.. వేడుకచేయకుండానే కీర్తి కనిపించకుండా పోయింది. చిన్నారికోసం జిల్లాలో పోలీసులు జల్లెడపడుతున్నప్పటికీ ఆచూకీ తెలియడంలేదు. గ్రామంలో, ప్రధానకూడళ్లలోని సిసిటివి పుటేజ్‌లను […]

మూడురోజులైనా జాడలేని చిన్నారి కీర్తి.. సోకసంద్రంలో పేరెంట్స్
Follow us

|

Updated on: Oct 28, 2020 | 11:30 AM

చిన్నారి కీర్తి జాడ ఇంకా తెలియడంలేదు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్లలో మూడు రోజుల క్రితం కీర్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే. బాలిక కోసం తల్లితండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4వ పుట్టినరోజు నాడే కీర్తి కనిపించకుండా పోయింది. పుట్టినరోజు వేడుక కోసం కీర్తి తండ్రి కొత్త దుస్తులు, చాక్లెట్‌లు తెచ్చే సమయానికి.. వేడుకచేయకుండానే కీర్తి కనిపించకుండా పోయింది. చిన్నారికోసం జిల్లాలో పోలీసులు జల్లెడపడుతున్నప్పటికీ ఆచూకీ తెలియడంలేదు. గ్రామంలో, ప్రధానకూడళ్లలోని సిసిటివి పుటేజ్‌లను పోలీసులు తనిఖీచేస్తున్నారు.