ప్రకాశం జిల్లాలో నిప్పంటుకుని నాలుగు పూరిల్లు దగ్ధం

ప్రకాశం జిల్లా పర్చూరులోని ఇందిరాకాలనీలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని నాలుగు పూరిల్లు దగ్ధమయ్యాయి. తొలుత ఓ గుడిసెలో అంటుకున్న మంటలు క్షణాల్లో మిగతావాటికి అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటలకు కాలిబూడిదయ్యాయని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటల్ని ఆర్పేశారు. ప్రమాద సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదంలో సుమారు 8 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:16 pm, Sat, 2 March 19

ప్రకాశం జిల్లా పర్చూరులోని ఇందిరాకాలనీలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని నాలుగు పూరిల్లు దగ్ధమయ్యాయి. తొలుత ఓ గుడిసెలో అంటుకున్న మంటలు క్షణాల్లో మిగతావాటికి అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటలకు కాలిబూడిదయ్యాయని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటల్ని ఆర్పేశారు. ప్రమాద సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదంలో సుమారు 8 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.