Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఉన్నతాధికారులు సీరియస్. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఏవిధంగా ప్రభుత్వానికి విక్రయించారంటూ ఆరా తీస్తున్న అధికారులు. ఇప్పటికే ప్రారంభమయిన పోలీసు దర్యాప్తు.
  • విజయవాడ: ఆత్రేయపురం ప్రేమకథ సినిమా పేరుతో మోసం. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ యువతులకు వల. అమరావతి శివక్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బన్ కటింగ్ చేసిన గుంటూరు జిల్లాకు చెందిన రెంవత్ బిక్షా . విజయవాడ, గుంటూరు జిల్లాకు చెందిన యువతులను హీరోయిన్లుగా చేస్తానంటూ చీటింగ్.
  • తూ. గో.జిల్లా కాకినాడ.. కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ప్రకటించిన వీడియో కన్ఫరెన్సింగ్ సొల్యూషన్ ఛాలెంజ్ లో ఎంపికయిన ఆంద్రప్రదేశ్ కు చెందిన వంశీ. ఆదిత్య కాలేజ్ విద్యార్థి వంశీ కురమా కి జాతీయ స్థాయి గుర్తింపు. అమెరికన్ యాప్ జూమ్ అప్ కు ప్రత్యామ్నాయం గా లిబిరో అనే భారతీయ యాప్ ను రూపొందించిన వంశీ.
  • విజయనగరం జిల్లాలో దారుణం. సీతానగరం మండలం నిడగల్లు లో కన్నకూతురు పై తండ్రి అత్యాచారం. గత కొన్నినెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న తండ్రి. తండ్రి ను కాపాడాలని పోలీసులకు వీడియో వాయిస్ పంపిన కూతురు. రంగంలోకి దిగిన పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • హైదరాబాద్ లో మాయమైన సండే సందడి. చాలా ఏరియా లలో కనిపిస్తున్న కర్ఫ్యూ వాతావరణం . షాపులు...మాల్స్ ..రెస్టారెంట్లు..తెరిచి ఉన్నా కన్పిపించని పబ్లిక్. ఆదివారం మార్కెట్ లలో సైతం అనంతం మాత్రం గానే కొనుగోలుదారు. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న కరోనా భయం. ఇళ్లకే పరిమితం అవుతున్న జనం. హైదరాబాద్ లో పెరుగుతున్న అధిక కేసులతో ... అలర్ట్ అయిన పబ్లిక్.
  • రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న అంతర్గత విబేధాలు. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్య తారాస్థాయికి చేరుకున్న విభేదాలు . గెహ్లాట్ తీరుపై సచిన్ పైలెట్ అసంతృప్తి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేసేందుకు తన వర్గం శాసన సభ్యులతో ఢిల్లీ పయనం.

ఒకే కుటుంబంలో నలుగురికి క‌రోనా !

Four Peoples Infected with Coronavirus From one Family In Telangana State, ఒకే కుటుంబంలో నలుగురికి క‌రోనా !
ఢిల్లీలో జ‌రిగిన మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారింది. అక్క‌డ్నుంచి వ‌చ్చిన వారు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల‌కు చెందిన‌వారు కావండంతో వ్యాధి తీవ్ర‌త అంత‌టా విస్త‌రించింది. ప్ర‌తి జిల్లా నుంచి రెండంకెల సంఖ్య‌తో క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. దీంతో తెలుగు ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. లాక్ డౌన్ ను కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ వైర‌స్ వేగంగా విస్తరిస్తోంది. అటు ప్రజలు – ఇటు ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌టంతో మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది.
రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి ప‌రిధిలో ఒకే ఇంట్లో న‌లుగురికి కరోనా వైరస్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. జల్ పల్లి మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మత ప్రార్థనలకు ఢిల్లీకి వెళ్లొచ్చాడు. ఆ తరువాత అతడికి కరోనా పాజిటివ్ అని రావడంతో అప్రమత్తమైన అధికారులు ఆయన కుటుంబసభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. మొద‌ట కుటుంబ యాజ‌మానికి ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అనుమానంతో అత‌ని కుటుంబ స‌భ్యులు అంద‌రికీ ప‌రీక్ష‌లు చేయ‌గా, అత‌డి భార్య‌, కుమారుడు, కుమార్తెకు కూడా క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. ఈ ముగ్గరు కూడా ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. మరికొందరు సభ్యులకు నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం పాజిటివ్ వచ్చిన నలుగురిలో ముగ్గురు వీరే కావడం గమనార్హం.

Related Tags