కుటుంబంపై డెంగ్యూ పంజా.. నలుగురు మృతి..!!

వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రాన్ని వైరల్‌ ఫీవర్స్‌ వణికిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా వంటి జ్వరాలతో జనాలు అల్లాడిపోతున్నారు. విపరీతమైన జ్వరం, ఒళ్లంత నొప్పులతో రోగులు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. చాలా డెంగ్యూ బాధితులు ప్లెట్లెట్స్‌ తగ్గిపోయి మృత్యువాత పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలో నాలుగు వ్యక్తులు డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కొల్పోయారు. ఈ సంఘటన జిల్లాల్లోనే తీవ్ర కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్‌లో […]

కుటుంబంపై డెంగ్యూ పంజా.. నలుగురు మృతి..!!
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2019 | 6:02 PM

వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రాన్ని వైరల్‌ ఫీవర్స్‌ వణికిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా వంటి జ్వరాలతో జనాలు అల్లాడిపోతున్నారు. విపరీతమైన జ్వరం, ఒళ్లంత నొప్పులతో రోగులు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. చాలా డెంగ్యూ బాధితులు ప్లెట్లెట్స్‌ తగ్గిపోయి మృత్యువాత పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలో నాలుగు వ్యక్తులు డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కొల్పోయారు. ఈ సంఘటన జిల్లాల్లోనే తీవ్ర కలకలం రేపింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్‌లో నివాసముంటున్న గుడిమల్ల రాజగట్టుకు భార్య, ఓ కొడుకు, కూతురు ఉన్నారు. భార్య సోను మూడోసారి గర్భవతి. స్థానికంగా ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజగట్టు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతడికి డెంగ్యూ జ్వరం వచ్చినట్లుగా నిర్ధారించారు. వారం రోజులపాటు చికిత్స తీసుకున్న రాజగట్టు అక్టోబర్‌ 16న మృత్యువాత పడ్డాడు. అదే కుటుంబానికి చెంది మృతుడి తాతా లింగయ్య కూడా డెంగీ బారీన పడి అక్టోబర్‌ 20న మృతి చెందాడు. ఇద్దరి మరణంతో ఆ కుటుంబాన్ని విషాదం ఆవహించింది. అంతలోనే రాజగట్టు కూతురు వర్షిణి కూడా తీవ్ర జ్వరంతో దీపావళి పండగ రోజునే చనిపోయింది. ఇలా ఒకరి తరువాత మరొకరుగా ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకుంది డెంగీ జ్వరం.
ఇప్పటికే భర్తను, బిడ్డను కొల్పోయిన రాజగట్టు భార్య సోను సైతం డెంగీ వ్యాధి లక్షణాలతో హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పది రోజుల వ్యవధిలోనే ముగ్గురి కొల్పోయిన ఆ ఇంటివారు తమ కొడలైన క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుణి వేడుకున్నారు. అయిన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 30న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సోను కూడా అనంతలోకాలకు వెళ్లిపోయింది. తల్లిదండ్రుల మరణంతో ఆ చంటిబిడ్డలిద్దరూ అనాధలుగా మిగిలారు. ఇలా ఒకే కుటుంబంలో డెంగీ పంజా బారిన పడి నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లాలో స్వైర విహారం చేస్తున్న విష జ్వరాల పట్ల ఇప్పటికైన అధికార యంత్రాంగం స్పందించాలని, హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దోమల నివారణ, ముందస్తుగా మందులు, టీకాలు రోగాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు.