బాప్ రే ! పిల్లులు, పులులు, సింహాలకూ కరోనా !

కరోనా మహమ్మారి వైరస్  క్రమంగా జంతువులకూ సోకుతోంది. న్యూయార్క్ లో రెండు పెంపుడు పిల్లులకు, అక్కడి ఓ జూలో నాలుగు పులులు, మూడు సింహాలకు కూడా ఇది సోకడం జంతు నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. మూడు వారాల క్రితమే ఈ జూలో నాలుగు సంవత్సరాల నాడియా అనే పులికి ఈ వైరస్ సోకిన విషయం గమనార్హం. దీని తరువాత మరో ఆరు పులులలోనూ కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వీటి ద్వారా మూడు ఆఫ్రికన్ సింహాలలో సైతం ఇవే […]

బాప్ రే ! పిల్లులు, పులులు, సింహాలకూ కరోనా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 23, 2020 | 8:16 PM

కరోనా మహమ్మారి వైరస్  క్రమంగా జంతువులకూ సోకుతోంది. న్యూయార్క్ లో రెండు పెంపుడు పిల్లులకు, అక్కడి ఓ జూలో నాలుగు పులులు, మూడు సింహాలకు కూడా ఇది సోకడం జంతు నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. మూడు వారాల క్రితమే ఈ జూలో నాలుగు సంవత్సరాల నాడియా అనే పులికి ఈ వైరస్ సోకిన విషయం గమనార్హం. దీని తరువాత మరో ఆరు పులులలోనూ కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వీటి ద్వారా మూడు ఆఫ్రికన్ సింహాలలో సైతం ఇవే లక్షణాలు కనిపించినట్టు క్యూరేటర్ తెలిపారు. ల్యాబ్ టెస్టుల్లో వీటికి కరోనా పాజిటివ్ రిపోర్టు వఛ్చినట్టు ఆయన చెప్పారు.  అయితే ఈ జంతువులు నార్మల్ గానే వ్యవహరిస్తున్నాయని, వీటి ఆహార అలవాట్లు ఏమీ మారలేదని, ఆయన చెప్పారు. ఇలాగే న్యూయార్క్ సిటీలో  వేర్వేరు యజమానుల ఇళ్లలో ఉన్న పెంపుడు పిల్లులు రెండు కూడా స్వల్పంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయట.. ఏది ఏమైనా జంతువుల నుంచి కరోనా వైరస్ మానవులకు వ్యాపించదని, మనుషుల వల్లే వీటికి ఈ వైరస్ సోకడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఈ జంతువులన్నీ త్వరలోనే కోలుకుంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.