క‌రీంన‌గ‌ర్‌లో మ‌రోమారు కోవిడ్ ప‌డ‌గ‌..

క‌రీంన‌గ‌ర్ మ‌రోమారు ఉలిక్కిప‌డింది. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ కోవిడ్‌-19 ర‌క్క‌సి చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది...

క‌రీంన‌గ‌ర్‌లో మ‌రోమారు కోవిడ్ ప‌డ‌గ‌..
Follow us

|

Updated on: Apr 03, 2020 | 12:47 PM

దేశ‌వ్యాప్తంగా మ‌ర్క‌జ్ మ‌త‌ప్రార్థ‌న‌ల ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. క‌రీంన‌గ‌ర్ మ‌రోమారు ఉలిక్కిప‌డింది. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ కోవిడ్‌-19 ర‌క్క‌సి చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. తాజాగా మ‌రోమారు త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. నగరంలో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) సుజాత ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిలో ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ముగ్గురు ఉండగా.. ఇండోనేసియా బృందంతో సన్నిహితంగా తిరిగిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన‌ట్లుగా తెలిపారు. వీరందరినీ హైదరాబాద్ తరలించినట్లు వెల్లడించారు.
కరీంనగర్‌లో ఇప్పటి వరకు 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీరిలో 10 మంది ఇండోనేసియా వాసులే కావడం గమనార్హం. ఇండోనేసియా బృందంలోని వారందరూ కరోనా నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. వీరి కారణంగా స్థానికంగా మరికొంత మందికి కరోనా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాన్ని దిగ్బంధం చేసి 100 వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహించారు. అనుమానితులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఎప్పటికప్పుడు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కరీంనగర్‌ నుంచి నిజాముద్దీన్‌లోని మత ప్రార్థనలకు మొత్తం 19 మంది వెళ్లొచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వారిలో 11 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. మరి కొందరి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు. కరోనా సోకిన బాధితులను సికింద్రాబాద్‌‌లోని గాంధీ ఆస్పత్రి, కింగ్‌ కోఠి ఆసుపత్రులకు తరలించినట్లు డీఎంహెచ్‌వో సుజాత  తెలిపారు.

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..