Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు. మామూలుగా అయితే ఈ వర్షాలకు జనం సేదతీరేవారే! కానీ కరోనా కాలం కావడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతున్న భయం వెంటాడుతోంది
  • లాక్‌డౌన్‌పై ప్రజలకు పూర్తి అవగాహన ఉండటంతో మంచి సహకారమే అందుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. అంతర్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలను కట్టడి చేసేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 5 వేల కేసులు నమోదుచేశామన్నారు.
  • ఆరోగ్యసేతు యాప్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారంతోపాటు... వ్యాధి లక్షణాలు, దగ్గర్లో ఎక్కడెక్కడ హెల్త్‌ సెంటర్స్‌ ఉన్నాయన్న సమాచాం లభిస్తుంది. వీటితోపాటు మనం కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రాంతానికి వెళ్తే అలర్ట్ వస్తుంది. అయితే కొన్నిచోట్ల ఈ యాప్‌ పనిచేయడం లేదు. దీంతో గందరగోళానికి పడిపోయిన వినియోగదారులు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వ్యాధి ప్రబలడం తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలను, అంతర్జాతీయ స్థాయిలో పాటించబడిన పద్దతులను మనం అనుసరిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

కరోనాను జయించిన నాలుగు నెలల శిశువు

చైనాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్‌కి 26దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచమే వణికిపోతున్న ఈ కరోనాను ఓ నాలుగు నెలల చిన్నారి జయించింది. చైనాకు చెందిన 4 నెలల శిశువుకి ఇటీవల కరోనా వైరస్..
Four months old baby escaped from Coronavirus in chaina, కరోనాను జయించిన నాలుగు నెలల శిశువు

చైనాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్‌ ధాటికి 26దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచాన్నే భయాందోళనకు గురిచేస్తోన్న కరోనాను ఓ నాలుగు నెలల చిన్నారి జయించింది. చైనాకు చెందిన ఓ తల్లికి కరోనా వైరస్ సోకింది. అయితే ఆమెతో పాటు 4 నెలల శిశువుకి ఇటీవల కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో.. చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణలో ఆ చిన్నారికి చికిత్స అందించారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో శిశువును కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 18,254 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నారు.

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు. అనేక దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. ఎన్నో దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఇకపై కరోనాను అధికారికంగా ‘కోవిడ్-19’ అని పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్‌ను, డీ అక్షరం డిసీజ్‌ ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు.

Four months old baby escaped from Coronavirus in chaina, కరోనాను జయించిన నాలుగు నెలల శిశువు

Related Tags