నలుగురు కుటుంబసభ్యుల అనుమానాస్పద మృతి

వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

నలుగురు కుటుంబసభ్యుల అనుమానాస్పద మృతి
Follow us

|

Updated on: Aug 14, 2020 | 12:39 PM

వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామానికి చెందిన తల్లి ఆజీరాం బీ (63), కుమార్తె ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజాపాష (42), మనుమరాలు హసీన (10) ఇంట్లో వేర్వేరుచోట్ల విగతజీవులై పడి ఉన్నారు. వంటగదిలో ఆజీరాం బీ మృతదేహాన్ని, డైనింగ్‌ హాల్‌లో ఆస్మా బేగం మృతదేహాన్ని, ఇంటి వెనుక గుంతలో ఖాజాపాష మృతదేహాన్ని, హాల్‌లో హసీనా మృతదేహాలను గుర్తించారు.

శుక్రవారం ఉదయం 7గంటల దాటినా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా… నలుగురూ విగత జీవులై పడి ఉన్నారు. వెంటనే పోలీసులు, మృతుల బంధువులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఖాజా మృతదేహం పక్కన కొబ్బరికాయ, నిమ్మకాయలు కనిపించాయి. అక్కడే ఓ గొయ్యి తీసి ఉంది. ఇంట్లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినట్లు సమాచారం. జరిగిన ఘటన హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో నాగపూర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!