రంగారెడ్డి జిల్లాలో దారుణం.. ప్రాణాలు తీసిన మూఢత్వం.. 

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హరీష్‌ కుటుంబంగా గుర్తించారు.

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. ప్రాణాలు తీసిన మూఢత్వం.. 
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 4:53 PM

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హరీష్‌ కుటుంబంగా గుర్తించారు. అల్మాస్‌గూడలోని బీఎస్‌ఆర్‌ కాలనీ శ్రీసాయితేజ అపార్ట్‌మెంట్స్‌లోని 301లో వీరు నివాసముంటున్నారు. అయితే…గత రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో.. ఈ డోర్‌ తెరవండి ప్లీజ్‌ అనే కాగితం వారు నివాసముంటున్న డోర్‌కి అతికించి ఉండటాన్ని గమనించిన చుట్టు పక్కల వారు… పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ విషాదకరమైన సంఘటన వెలుగు చూసింది.

వివరాల్లోకెళితే.. వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం దోర్నాల గ్రామానికి చెందిన సువర్ణబాయి, అతని కుమారులు హరీశ్‌రావు, గిరీశ్‌రావు, స్వప్నలు గత రెండెళ్లుగా ఇక్కడ నివాసముంటున్నారు. తల్లి, కుమార్తె ఇంట్లోనే ఉంటుండగా…కుమారులు ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ల్లో చేతబడి శక్తుల చేత ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడి..ఏ దారి లేకనే సూసైడ్ చేసుకుంటున్నాం. మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయొద్దు. మమ్మల్ని నేరుగా అంతక్రియలకు తీసుకెళ్లండి.. ఇదే మా చివరి కోరిక’ అని రాసి ఉంది.

మరోవైపు.. బెడ్‌రూంలో మంచంపై సువర్ణబాయి మృతదేహం ఉండగా.. దానిపక్కనే స్వప్న, గిరీశ్‌ మృతదేహాలు ఉన్నాయి. వేరే గదిలో హరీశ్‌రావు మృతదేహం ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. కిచెన్‌, బెడ్‌రూంలో వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్న వారిని ఒకే గదిలో పెట్టి.. ఆ తర్వాత హరీశ్‌రావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు! ఐదుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు! ఐదుగురు మృతి
పర్సనల్ లోన్ విషయంలో తాకట్టు..కనికట్టు
పర్సనల్ లోన్ విషయంలో తాకట్టు..కనికట్టు
36 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. 20 రోజుల్లోనే బ్రేక్
36 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. 20 రోజుల్లోనే బ్రేక్
బుల్లెట్‌ ఫ్రూవ్‌ కారు కొనాలంటే ఇంత కష్టమా..?తయారీకి ముందే ఇవన్ని
బుల్లెట్‌ ఫ్రూవ్‌ కారు కొనాలంటే ఇంత కష్టమా..?తయారీకి ముందే ఇవన్ని
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఇకపై స్టేటస్ పెట్టగానే...
వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఇకపై స్టేటస్ పెట్టగానే...