విశాఖ ఫార్మాసిటీ ప్రమాదంపై నలుగురు సభ్యులతో కమిటీ

విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఈ ప్రమాదంపై కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.

విశాఖ ఫార్మాసిటీ ప్రమాదంపై నలుగురు సభ్యులతో కమిటీ
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 12:59 PM

విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఈ ప్రమాదంపై కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. దీనిపై విచారణ జరిపి‌ నివేదిక ఇవ్వాలని ఆయన కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ ఘటనపై వినయ్ చంద్ మాట్లాడుతూ.. ”డై మిథైల్ సల్ఫాక్సైడ్ వలన భారీ మంటలు ఏర్పడ్డాయి. ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతున్నాము” అని అన్నారు. ఫార్మాసిటీలో వరుస ప్రమాదాల‌పై మరోసారి జిల్లా స్ధాయిలో సమీక్ష నిర్వహించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

కాగా ఫార్మాసిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మల్లేశ్ అనే కార్మికుడికి గాయలవ్వగా.. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇక మరో కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతి కాగా.. ఆయన చనిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.