విమానం కూలి.. నలుగురు మృతి

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో కరోనా మున్సిపల్ ఎయిర్‌పోర్టులో చిన్న విమానం కూలి, నలుగురు వ్యక్తులు మృతిచెందారు. కరోనా ఎయిర్‌పోర్టులో బుధవారం విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాలిలో విమానం ఎగరలేకపోయిందని.. దీంతో ఫ్లైట్ ఫెన్స్‌ను తాకుతూ కుప్పకూలి బారికేడ్‌ని తాకినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. విమానం ప్రమాద సయమంలో 80 గ్యాలన్ల ఇంధనం మోస్తుంది. ఇక అదుపు తప్పి ఆపై పల్టీలు కొట్టి ఒక్కసారిగా పేలింది. విమానంపై పైలెట్ నియంత్రణ కోల్పోవడం కారణంగానే ఈ […]

విమానం కూలి.. నలుగురు మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 23, 2020 | 1:12 PM

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో కరోనా మున్సిపల్ ఎయిర్‌పోర్టులో చిన్న విమానం కూలి, నలుగురు వ్యక్తులు మృతిచెందారు. కరోనా ఎయిర్‌పోర్టులో బుధవారం విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాలిలో విమానం ఎగరలేకపోయిందని.. దీంతో ఫ్లైట్ ఫెన్స్‌ను తాకుతూ కుప్పకూలి బారికేడ్‌ని తాకినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. విమానం ప్రమాద సయమంలో 80 గ్యాలన్ల ఇంధనం మోస్తుంది. ఇక అదుపు తప్పి ఆపై పల్టీలు కొట్టి ఒక్కసారిగా పేలింది.

విమానంపై పైలెట్ నియంత్రణ కోల్పోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సిబ్బంది తెలిపారు. అయితే.. ప్రమాదానికి ప్రధాన కారణమేంటన్న విషయం ఇంకా వెల్లడికాలేదని, ఈ ప్రమాదంతో విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ఎయిర్‌పోర్టు అదికారులు పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణకు ఆదేశించాయని వెల్లడించారు.