సంక్రాంతి వేళ.. కన్నులవిందైన మూవీల హేల

సంక్రాంతి.. మూవీ రిలీజ్‌లకు అనువైన రోజు ఇది.. తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండగ అవ్వడం, పిల్లలకు, పెద్దలకు సెలవులు రావడం వల్ల సినిమా రిలీజ్‌లకి ఇది అనువైన సీజన్‌గా పరిగణిస్తారు. ఈ సారి పండగకి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్, పొంగల్ 2020 లో విడుదల కానుంది. దర్బార్ తో పాటు, మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, […]

సంక్రాంతి  వేళ.. కన్నులవిందైన మూవీల హేల
Follow us

|

Updated on: Nov 21, 2019 | 8:58 PM

సంక్రాంతి.. మూవీ రిలీజ్‌లకు అనువైన రోజు ఇది.. తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండగ అవ్వడం, పిల్లలకు, పెద్దలకు సెలవులు రావడం వల్ల సినిమా రిలీజ్‌లకి ఇది అనువైన సీజన్‌గా పరిగణిస్తారు. ఈ సారి పండగకి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్, పొంగల్ 2020 లో విడుదల కానుంది. దర్బార్ తో పాటు, మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలతో పాటు, నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ఎంత మంచివాడవురా విడుదల కోసం షెడ్యూల్ చేయబడ్డాయి. ఆ సినిమాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

దర్బార్: రజనీకాంత్, ఎఆర్ మురుగదాస్ కలిసి దర్బార్ కోసం తొలిసారి వర్క్ చేసారు. దాదాపు 25 ఏళ్ల తరువాత రజనీ పోలీస్ యూనిఫాంను ధరించడం ఈ సినిమా ప్రత్యేకత. పాలసీ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా రూపొందిన దర్బార్ లో ఆదిత్య అరుణసలాం అనే పోలీసు అధికారిగా రజనీ నటించనున్నాడు. ఈ చిత్రంలో రజనీ సరసన నయనతార జతకట్టింది. లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నివేదా థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, యోగి బాబు, యోగ్రాజ్ సింగ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు .ఈ చిత్రం 2020 జనవరి 9 న తెరపైకి రానుంది.

అల వైకుంఠపురంలో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన, ‘అల వైకుంఠపురంలో’ జనవరి 12, 2020 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, టబూలు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు, ఇప్పటికే విడుదలైన రెండు ఆడియో సింగిల్స్ యూట్యూబ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తున్నాయి. ఈ మూవీలో టబూ, జయరాం, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సునీల్ లు కూడా ఉన్నారు. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ కూడా జనవరి 11, 2020 న విడుదల కానుంది..ఈ చిత్రంలో మహేష్ ఒక ఆర్మీ మ్యాన్ గా కనిపించడం విశేషం.. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయశాంతి, రష్మిక మండన్న, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, అనసూయ భరద్వాజ్, హరి తేజ, రోహిణి, సుబ్బరాజు, పవిత్ర లోకేష్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.

ఎంత మంచివాడవురా యాక్షన్ మూవీస్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలా ఎన్నిటినో ట్రై చేసి చివరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీకి సైన్ చేసాడు హీరో కళ్యాణ్ రామ్.. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్షన్‌లో ఎంత మంచివాడవురా అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మూవీ జనవరి 15 న సంక్రాంతి ట్రీట్‌గా థియేటర్లలోకి రానుంది. మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ గుజరాతీ చిత్రం ఆక్సిజన్ కు రిమేక్ గా తెలుస్తోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసారు.

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో