మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. గ్యాంగ్ అరెస్ట్

కరోనా లాక్‌డౌన్‌ వేళ హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మానసిక వికలాంగురాలిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. గ్యాంగ్ అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 1:55 PM

కరోనా లాక్‌డౌన్‌ వేళ హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మానసిక వికలాంగురాలిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ శివారులోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో ఓ మతిస్థిమితం లేదని బాలిక ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన అక్బర్, జుమన్, గయాజ్‌, అలీంలు ఆమెను అనుసరించారు. ఆ తరువాత చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించి.. ఆ యువతిని ఓ పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటిన తరువాత బాలికకు ఫోన్‌ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. దీంతో కంగారుపడిన వారు దుండిగల్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వచ్చిన ఫోన్‌కాల్ ఆధారంగా గాలింపు చేపట్టి.. రెండు గంటల తరువాత దేవేందర్‌నగర్‌లో బాలికను గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు అక్కడి నించి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మిగిలిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్, అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read This Story Also: ‘పారాసైట్’ వివాదం.. జక్కన్న క్లారిటీ..!