నగరంలో పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం

హైదరాబాద్ నగరంలో గంజాయి స్మగ్లింగ్ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం
Follow us

|

Updated on: Oct 23, 2020 | 5:48 PM

హైదరాబాద్ నగరంలో గంజాయి స్మగ్లింగ్ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సభ్యుల ఈ ముఠా విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డి సి పి ఏఆర్ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు.

విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి నగరంలో గంజాయి సప్లై చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కళ్యాణ్, యాదగిరి నగర్ అబ్రార్ హుస్సేన్, చేతన్ కుమార్ ఉపాధ్యాయ బంజారా హిల్స్, ఇంద్రనగర్ కు చెందిన రమేష్, కృష్ణానగర్ కు చెందిన శ్యాంసుందర్ రెడ్డి ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయిస్తున్నట్లుగా వివరించారు.

గురువారం యాదగిరి నగర్ లో నివాసముండే హుస్సేన్, చేతన్ ల గదిలో నిషేధిత గంజాయి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఇన్ స్పెక్టర్ సత్తయ్య నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. చేతన్ హుస్సేన్‌ లను అదుపులోకి తీసుకొని విచారించగా మరో ముగ్గురితో కలిసి గంజాయ్ విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో మిగిలిన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు కళ్యాణ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. త్వరలోనే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. నిషేధిత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు అమ్మేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డి సి పి ఏఆర్ శ్రీనివాస్ హెచ్చరించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!