ఉత్సవంలో తొక్కిసలాట.. నలుగురు మృతి

తమిళనాడులో అపశృతి చోటుచేసుకుంది. కాంచీపురంలోని అత్తివరదర్ రాజస్వామి ఉత్సవంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. మరికొంత మంది గాయపడ్డారు. మృతుల్లో గుంటూరు జిల్లాకు చెందిన మహాలక్ష్మీ అనే మహిళ కూడా ఉంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అత్తివరద రాజస్వామి ఆలయంలో ప్రతి నలభై ఏళ్లకోసారి ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వామి వారి పురాతన విగ్రహాన్ని కోనేటి నుంచి ఆలయ అర్చకులు బయటకు తీసి.. 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేపడతారు. అనంతరం కోనేటి అడుగుకు పంపించేస్తారు. అయితే ఈ నెల 1న ప్రారంభమైన ఉత్సవాల్లో 18వ రోజవ్వడంతో పాటు.. శ్రవణా నక్షత్రం రావడంతో.. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *