బిగ్ బాస్ టైటిల్ వేటలో ‘ఆ నలుగురు’?

Four Contestants In Line To Win Bigg Boss Title, బిగ్ బాస్ టైటిల్ వేటలో ‘ఆ నలుగురు’?

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో విజయవంతంగా తొమ్మిది వారాలు పూర్తి  చేసుకుని పదో వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్‌లో రాహుల్‌తో కలుపుకుని తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ట్విస్టులు, షాకులు, రొమాన్స్, గొడవలతో బిగ్ బాస్ ప్రేక్షకులను రక్తికట్టిస్తోంది. అయితే కొద్దిరోజులుగా దీని టీఆర్పీ రేటింగ్స్ తగ్గాయని చెప్పవచ్చు. హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రెజా ఎలిమినేట్ కావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ డీలాపడ్డారు. ఇకపోతే షో చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఆశ్చర్యపోయే టాస్కులు ఇస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ టైటిల్ వేటలో నలుగురు కంటెస్టెంట్లు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ఇక వారు రవికృష్ణ, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్‌లు. బాబా భాస్కర్ మొదటి నుంచీ మంచితనం మూర్తీభవించిన వ్యక్తిగా ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రవికృష్ణకు ఎటువంటి నెగటివిటీ అనేది లేదు. తమన్నా సింహాద్రి తిట్ల దుమారంలో చిక్కుకున్నా.. సహనశీలిగా పేరు పొందిన రవికృష్ణ తనదైన విశిష్టతను చాటుకున్నాడు. సోషల్ మీడియాలో వీరిద్దరికి  ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉందని చెప్పవచ్చు.

మరోవైపు యాంకర్ శ్రీముఖి ఫాలోయింగ్ గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. ‘పటాస్’ షో ద్వారా చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఆమె టైటిల్‌ వేటలో మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీనే ఇస్తుంది. అటు వరుణ్ సందేశ్ మొదట్లో కాస్త నెగటివిటీ తెచ్చుకున్నా.. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరు సంపాదించాడు.

ఇప్పుడు వీళ్ళ నలుగురు బిగ్ బాస్ టైటిల్‌ వేటలో ముందున్నారని చెప్పవచ్చు. అయితే మిగిలిన కంటెస్టెంట్లయినా శివజ్యోతి, మహేష్ విట్టా, పునర్నవి, వితికా, రాహుల్‌లకు కూడా ఫాలోయింగ్ ఉన్నా.. ప్రతి వారం ఒక్కొక్కరిగా ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి వీరి నలుగురిలో ఎవరైనా టైటిల్ గెలుస్తారో.. లేదా సంచలనాలు నమోదవుతాయో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *