సినిమా హాళ్లు మళ్ళీ తెరిచారు, ఆడియన్స్ ఏరీ ?

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గురువారం సినిమా థియేటర్లు తిరిగి ఓపెన్ అయ్యాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రికాషన్స్ తో వీటిని తెరిచారు. ఢిల్లీ విషయానికి వస్తే గ్రేటర్ కైలాష్ లోని ఓ థియేటర్ లో 150 సీట్లకు గాను కేవలం 4 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మార్నింగ్ షో కి నాలుగైతే, మ్యాట్నీకి అయిదు టికెట్లు అమ్ముడు పోయాయి. కానీ కొత్త మూవీ కాదని, పాత చిత్రాన్నే ఈ సినిమా హాల్లో ప్రదర్శిస్తున్నారని,  ఈ థియేటర్ కి వఛ్చిన […]

సినిమా హాళ్లు మళ్ళీ తెరిచారు, ఆడియన్స్ ఏరీ ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 15, 2020 | 8:41 PM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గురువారం సినిమా థియేటర్లు తిరిగి ఓపెన్ అయ్యాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రికాషన్స్ తో వీటిని తెరిచారు. ఢిల్లీ విషయానికి వస్తే గ్రేటర్ కైలాష్ లోని ఓ థియేటర్ లో 150 సీట్లకు గాను కేవలం 4 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మార్నింగ్ షో కి నాలుగైతే, మ్యాట్నీకి అయిదు టికెట్లు అమ్ముడు పోయాయి. కానీ కొత్త మూవీ కాదని, పాత చిత్రాన్నే ఈ సినిమా హాల్లో ప్రదర్శిస్తున్నారని,  ఈ థియేటర్ కి వఛ్చిన ఓ ప్రేక్షకుడు చెప్పాడు. ఇన్ని నెలలూ..సుమారు ఏడు నెలల పాటు థియేటర్ల మొహం చూడలేకపోయిన తను కాస్త ఎగ్జైటింగ్ గా వచ్చానని చెప్పాడా సినిమా ప్రియుడు.  అయితే మెల్లగా ఆడియెన్స్ పెరుగుతారని సినిమా హాళ్ల యజమానులు ఆశిస్తున్నారు.