Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో పంచాయతీ సెక్రెటరీ కళ్యాణ్.. ట్రైన్ కింద పడి ఆత్మహత్య. గత కొద్దిరోజుల క్రితం.. ఇతని కూతుర్ని.. ఘట్కేసర్ లో ఒకతను గొంతుకోసి చంపటం జరిగింది.
  • హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ నిర్వాకం. అధిక రెట్ ల తో సినిమా టికెట్ల విక్రయం. సినిమా టికెట్ ల పై 10 శాతం అధికంగా . జీ ఎస్టీ ఛార్జ్ వసూలు. 18 శాతం కు బదులు 28 శాతం టాక్స్ విధించి టికెట్ విక్రయం పై 30 లక్షలు ఆదాయం. జి ఎస్టీ అధికారులకు గతం లో పలు ఫిర్యాదులు.
  • సౌందర్యంతోపాటు సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి. పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై మరింతగా దృష్టిపెట్టాలి. భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలి. నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం (అర్కిటెక్చర్) కూడా ఒకటి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలి. ఐఐఏ జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • కోవిడ్-19పై ప్రధాని సమీక్షా సమావేశం. భేటీలో ఆరోగ్యశాఖ మంత్రితో పాటు హోంమంత్రి. కోవిడ్-19 తాజా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై చర్చ.
  • టీవీ9 మేయర్ బొంతు రామ్మోహన్: సచివాలయ కూల్చివేతలు సందర్భంగా పర్యావరణానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కూల్చివేత లకు జిహెచ్ఎంసి నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి. భారీ స్థాయిలో వచ్చే శిధిలాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టపోతున్నాం... కొన్ని వందల లారీల్లో శిథిలాలను జీడిమెట్ల లోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కి తరలిస్తారు. రాత్రి సమయంలో మాత్రమే శిథిలాల తరలింపును చేపడతాం. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, రోడ్లు పాడవకుండా అన్ని జాగ్రత్తలు ఇలా తరలింపులో తీసుకుంటాం.. సచివాలయ శిథిలాల నుంచి కంకర, ఐరన్, డస్ట్ వేరుచేస్తారు.
  • నల్లకుం లోని పీహెచ్సీ సెంటర్, లాలాగూడ లోని రైల్వే హాస్పిటల్ కరోనా టెస్టింగ్ సెంటర్లను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కరోనా టెస్ట్ లు జరుగుతోన్న తీరు, వైద్య సిబ్బంది జాగ్రత్తలపై వివరాలను ఆరా తీసిన కేంద్రమంత్రి. కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.

ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీస్‌కి ఒక్కో లక్ష రివార్డ్..

Raah Group Foundation Chairman Naresh Selpar annouces rs 1 lakh reward to police who involved in encounter, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీస్‌కి ఒక్కో లక్ష రివార్డ్..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కి సంబంధించి..తెలంగాణ పోలీసులకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అదే సమయంలో పోలీసులు కేంద్ర హోంశాఖకు, ఎన్‌హెచ్‌ఆర్సీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే  మేనకా గాంధీ, కార్తీ చిదంబరం లాంటి కొంతమంది నాయకులు ఎన్‌కౌంటర్ చట్టవిరుద్దమని కామెంట్స్  చేస్తున్నారు.

అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీసుకు ప్రముఖ పారిశ్రామికవేత్త  రూ. లక్ష రివార్డు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ అధినేత నరేశ్ సెల్పార్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎంతో గొప్పగా నిందితులకు గుణపాఠం చెప్పారంటూ ఆయన తెలంగాణ కాప్స్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళలందరికి తమని తాము ప్రొటెక్ట్ చేసేలా ప్రభుత్వాలు శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆయన అభ్యర్థించారు.

Raah Group Foundation Chairman Naresh Selpar annouces rs 1 lakh reward to police who involved in encounter, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీస్‌కి ఒక్కో లక్ష రివార్డ్..

 

Related Tags