ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

Former union Minister Jaipal Reddy funeral procession finished, ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

కాంగ్రెస్ సీనియర నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోగల పీవీ ఘాట్ పక్కనే ఆయనకు అంత్యక్రియలు జరిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇవి ముగిశాయి. కాంగ్రెస్ నేతలు, కుటుంబసభ్యులు జైపాల్‌రెడ్డి పార్ధివ దేహానికి కడసారి వీడ్రోలు పలుకుతూ అశ్రునయనాలతో నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో సాగిన అంతిమయాత్రలో పోలీసులు గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపారు.

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన జైపాల్‌రెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నేతను కోల్పోయింది. ముందుగా ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఇంటినుంచి పార్టీ కార్యాలయం గాంధీభవన్‌కు తరలించారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం కొద్దిసేపు ఉంచారు ..అటు తర్వాత నెక్లెస్ రోడ్డు వరకు అంతిమయాత్ర సాగింది. జైపాల్‌రెడ్డి పార్థివదేహంతో పాటు తెలగాణ కాంగ్రెస్ నేతలతోపాటు ఆపార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితర నేతలు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, స్పీకర్ రమేశ్ కుమార్ ఇద్దరూ పార్ధివ దేహాన్ని తరలిస్తున్న పాడి మోసారు.

Former union Minister Jaipal Reddy funeral procession finished, ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *