కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కుమారుడు మృతి

భారత్‌ను కరోనా గడగడలాడిస్తోంది. దేశవ్యాప్తంగా రోజుకూ వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడుతుండగా, వందల సంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు అనేక మందిని కోవిడ్ వణికిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కుమారుడు..

కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కుమారుడు మృతి
Follow us

|

Updated on: Jul 01, 2020 | 12:58 PM

భారత్‌ను కరోనా గడగడలాడిస్తోంది. దేశవ్యాప్తంగా రోజుకూ వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడుతుండగా, వందల సంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు అనేక మందిని కోవిడ్ వణికిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కుమారుడు ఒకరు కరోనా వైరస్ సోకి మరణించారు.

కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్ (40) కరోనా వైరస్ సోకటంతో ప్రాణాలు కోల్పోయాడు. లక్నో నగరానికి చెందిన దినేష్ కు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దినేష్ ను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దినేష్ మరణించారు. సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడైన బేణిప్రసాద్ వర్మ ఈ ఏడాది మార్చి 27వతేదీన మరణించారు. ఇప్పుడు ఆయన కుమారుడు కరోనాతో చనిపోయాడు. బేణిప్రసాద్ వర్మ గతంలో యూపీఏ -2 ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు.

మరోవైపు దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,85,493కు చేరింది. అందులో 2,20,114 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 3,47,979 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు అటు గడిచిన 24 గంటల్లో 507 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 17,400కు చేరింది.