ఏపీ రాజధాని మార్పు ఖాయం.. కానీ మధ్యలో ‘ట్విస్ట్’.?

ఏపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలించే యోచనలో ఉందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్‌లో రాజధానికి సర్కార్ కేటాయించిన నిధులు, తాజాగా అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చాలని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. జగన్ సర్కార్ ఏపీ రాజధానిని దొనకొండకు మార్చడం ఖాయమని చింతామోహన్ […]

ఏపీ రాజధాని మార్పు ఖాయం.. కానీ మధ్యలో 'ట్విస్ట్'.?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 21, 2019 | 3:29 PM

ఏపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలించే యోచనలో ఉందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్‌లో రాజధానికి సర్కార్ కేటాయించిన నిధులు, తాజాగా అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చాలని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. జగన్ సర్కార్ ఏపీ రాజధానిని దొనకొండకు మార్చడం ఖాయమని చింతామోహన్ తెలిపారు.
ఈ విషయంపై సీఎం జగన్ ఇప్పటికే కేంద్రంతో చర్చలు జరిపారని ఆయన అన్నారు. అయితే రాజధాని విషయంలో జగన్ తొందరపడకూడదని.. దొనకొండ రాజధానికి ఆమోదయోగ్యం కాదన్న ఆయన.. అన్ని వనరులు కలిగి ఉన్న తిరుపతిని క్యాపిటల్ చేయాలని చింతామోహన్ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.