తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు

తెలంగాణ రాష్ట్ర తొలిహోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(86) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు
Follow us

|

Updated on: Oct 22, 2020 | 5:40 AM

Naini Narsimha Reddy Has Passed Away : తెలంగాణ రాష్ట్ర తొలిహోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(86) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆసుపత్రికి వెళ్లి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.  అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు వెల్లడించారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు వి.శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌. నాయినికి నలుగురు మనవళ్లు.

సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…

నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరుని కోల్పోయానన్నారు. నాయిని మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి, తెలంగాణ రాష్ర్టానికి, కార్మిక లోకానికి తీరనిలోటని తెలిపారు.