Breaking News
  • కృష్ణాజిల్లా: గన్నవరంలో విషాదం. చెరువులో దూకి డిగ్రీ విద్యార్థి మురళి ఆత్మహత్య. ఎస్సై నారాయణమ్మ భర్త వేధింపులే కారణమంటూ.. వాయిస్‌ మెసేజ్‌ పెట్టిన మురళి.
  • తూ.గో: మంత్రి విశ్వరూప్‌కు హైకోర్టులో చుక్కెదురు. అమలాపురం ల్యాండ్‌ మార్క్‌ శుభకలశంను కూల్చొద్దని హైకోర్టు స్టే. హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ మున్సిపల్‌ చైర్మన్ యాళ్ల నాగ సతీష్.
  • గుంటూరు: ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉంది-కళా వెంకట్రావ్‌. ఉచిత ఇసుక విధానం ఒక్కటే కొరతను తీరుస్తుంది. నియోజకవర్గాల వారీగా ఇసుక రీచ్‌లు పెట్టి అవినీతికి తెరలేపారు. 50 మంది చనిపోయిన తర్వాత తెచ్చిన పాలసీ దారుణంగా ఉంది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకోవాలి. ఇసుక ధర సామాన్యుడికి అందుబాటులో ఉండాలి-కళా వెంకట్రావ్‌.
  • అనంతపురం: నియోజకవర్గానికో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ-బొత్స. అనంతపురం జిల్లాలో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు. వరదలు తగ్గడంతో ఇసుక అందుబాటులోకి వస్తోంది-మంత్రి బొత్స. మరో మూడు రోజుల్లో ఇసుక కొరతను పూర్తిగా అధిగమిస్తాం-బొత్స. పరస్పర అంగీకారంతోనే సింగపూర్‌తో ఒప్పందం విరమించుకున్నాం. పెట్టుబడులు పెడతామని సింగపూర్‌ మంత్రి చెబుతున్నారు-బొత్స.
  • తూ.గో: రామచంద్రపురం మండలం మాలపాడులో దారుణం. యువతిపై పాలిక రాజు అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారం. యువతిని ఫొటోలు తీసి బెదిరించి పలుసార్లు అఘాయిత్యం. ఏడు నెలల గర్భవతి అయ్యాక గుర్తించిన తల్లిదండ్రులు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు. కేసునమోదు చేసిన రామచంద్రపురం పోలీసులు.
  • ఢిల్లీ: సోనియాగాంధీతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • ఆర్టీసీ సమ్మెపై విచారణను ముగించిన హైకోర్టు. హైకోర్టుకు కొన్ని పరిమితులున్నాయి. పరిధిదాటి ముందుకు వెళ్లలేం-హైకోర్టు. సమ్మెపై ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసిన హైకోర్టు. ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు. సమస్య పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం. 2 వారాల్లోగా సమస్య పరిష్కరించాలన్న హైకోర్టు. రూట్స్‌ ప్రైవేటీకరణ పిటిషన్‌, ఆత్మహత్యలపై రేపు విచారణ. కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేయాలని.. ప్రభుత్వం, ఆర్టీసీ కార్పొరేషన్‌కు హైకోర్టు ఆదేశం.

మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట… ఇకనైనా అజ్ఞాతం వీడతారా?

గత నెల 27 తేదీన శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తున్న అధికారులని సమీక్ష నిర్వహించాలన్న నెపంతో ఎంపీడీఓ కార్యాలయంలోకి పిలిపించి వారిని దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరరావు, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో కూన రవికుమార్ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఈ నెల 25 తేదీన అతడికి హైకోర్టు లో బెయిల్ మంజూరు అయింది. అయినా ఇంకా అతడు అజ్ఞాతంలోనే వున్నాడు. అతనిపై ఈ ఒక్క కేసు మాత్రమే ఇప్పటి వరకూ నమోదు అయ్యింది. ఈ కేసులో అతడితో పాటు మరో 11 మందిపై కూడా కేసు నమోదు కావటం అందులో పది మంది అరెస్టు కావడం కూడా జరిగింది. కేసు నమోదైన తరువాత కూన ఇంటివద్ద హైడ్రామా నెలకొంది. పోలీసులు సోదాలు నిర్వహించడానికి ప్రయత్నించగా కూన రవి  భార్య ప్రమీల వారిని అడ్డుకున్నారు.  వారంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారంటూ మండిపడ్డారు. దీంతో కూన రవికుమార్ ఇంటివద్ద ఒక ఏ‌ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, మహిళా హోం గార్డును పికెటింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తమ్మినేని సీతారాంపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే… శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత, ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేసుల్లో చిక్కుకున్న కూన అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ నిర్వహించింది. అనంతరం కూన రవికుమార్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ హయాంలో కూన ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.

ఈ కేసులో కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినా కోర్టు మంజూరు చేయలేదు. దీంతో నేరుగా హైకోర్టును ఆశ్రయించగా మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ బెయిల్ పత్రాలు తీసుకుని కూన రవికుమార్ గురువారం ఆముదాలవలస కోర్టుకు హాజరుకానున్నారు.. ఈ నేపథ్యంలో కూన రవికుమార్‌ను మరో కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కావాలనే తమ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కూన రవికుమార్‌ను అరెస్టు చేస్తే జిల్లా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.