Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

చంద్రబాబుకు మరో షాక్..ఆయన మౌనం అందుకేనా?

former tdp minister missing, చంద్రబాబుకు మరో షాక్..ఆయన మౌనం అందుకేనా?

టిడిపికి, ఆ పార్టీ చీఫ్ అయిన చంద్రబాబుకు మరో పెద్ద షాక్ తగలబోతోందా ? ఆ మాజీ మంత్రి అంతర్ధానంలో అంతరార్థం అదేనా ? అమరావతిని, తెలుగుదేశం పార్టీ శ్రేణులను కుదిపేస్తున్న ప్రశ్న ఇది. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎక్కడ? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు. ఆఫీసుకు రావడం ఎందుకు తగ్గించారు. మీడియాలో హడావుడి అసలే లేదు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. ఒకప్పుడు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేత మౌనం వెనుక కారణాలేంటి? కండువా కలర్‌ మారబోతుందా? లేక వ్యూహాత్మక మౌనమా? ఇంతకీ ఆ లీడరెవరు ? ఏం జరుగుతోంది ? రీడ్ దిస్ స్టోరీ..

ప్రత్తిపాటి పుల్లారావు. మాజీ మంత్రి. టీడీపీలో కీలక నేత. గుంటూరు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేశారు. అధికారంలోకి రావడంతోనే మంత్రి అయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా.. మంత్రిగా టీడీపీని ముందుండి నడిపించారు. ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి గత ఎన్నికల్లో శిష్యురాలి చేతిలోనే ఓడిపోయారు. ఓటమి తర్వాత కొంత కాలం హడావుడి చేసిన ఆయన…ఇప్పుడు పూర్తిగా సైలెంట్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.

former tdp minister missing, చంద్రబాబుకు మరో షాక్..ఆయన మౌనం అందుకేనా?

ఎన్నికల తర్వాత మూడు నెలల పాటు పార్టీ కార్యక్రమాల్లో ప్రత్తిపాటి చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ చేపట్టిన ఛలో ఆత్మకూరులో లీడ్‌ తీసుకున్నారు. పార్టీ బలోపేతం దిశగా ఆలోచనలు చేశారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే పల్నాడు నేత కోడెల శివప్రసాద్‌ రావు మరణం తర్వాత ప్రత్తిపాటిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడం మానేశారు. జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నెలలో లోకేష్‌ పొన్నూరు పర్యటనకు కూడా రాలేదు. వల్లభనేని వంశీ, అవినాష్ వంటి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసినపుడు కూడా ప్రత్తిపాటి నుంచి రియాక్షన్‌ లేదు.

రెండు నెలలుగా పార్టీ స్టేట్‌ ఆఫీసులో పుల్లారావు ఒక్క ప్రెస్‌మీట్‌లో పాల్గొనలేదు. గతంలో చిలకలూరిపేటలో నివాసం ఉండే ఆయన..ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రత్తిపాటి మౌనం వెనుక పార్టీ మారే ఎజెండా ఉందా? అనే డిస్కషన్ నడుస్తోంది. గతంలో ఆయన బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే ఆ సమయంలో ఆయన వాటిని కొట్టిపారేశారు. అయితే రెండు నెలలుగా సైలెంట్‌గా ఉండడం వెనుక కారణాలు ఏంటి? అనే అనుమానాలు కార్యకర్తల్లో ఉన్నాయి. కొంతకాలం వెయిట్‌ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ప్రత్తిపాటి ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి ప్రత్తిపాటి రానున్న రోజుల్లో ఏదో ఒక కీలక నిర్ణయం మాత్రం తీసుకుంటారని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.