Breaking News
  • ఢిల్లీ: దేశవ్యాప్తంగా 56లక్షలు దాటిన కరోన కేసుల సంఖ్య, 90 వేలు దాటిన మృతుల సంఖ్య. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 56, 46, 011 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. గడచిన 24 గంటల్లో 83, 347 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1, 085 మంది మృతి. 9, 68, 377 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 45, 87, 614 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 90, 020 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 89, 746 మంది బాధితులు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.25%, మరణాల రేటు 1.59%.
  • ఏపీ రాజకీయాలపై చర్చించాం-పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌. బీజేపీ, వైసీపీ, జనసేన, టీడీపీ అన్నీ ఒకే రకమైన పార్టీలు. ప్రశ్నించేవారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఈనెల 24 నుంచి నవంబర్‌ 6 వరకు రైతుల పక్షాన పోరాడుతాం. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీలో పోరాడుతాం-ఉమెన్‌చాందీ. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్ణయాలు మారవు-ఉమెన్‌ చాందీ.
  • హైదరాబాద్: అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు-వీహెచ్‌. నేను అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తే తొలగించి గోషామహల్‌ పీఎస్‌లో పెట్టారు. అంబేద్కర్‌ వల్లే కేసీఆర్‌ సీఎం అయ్యారు-వీహెచ్‌.
  • విశాఖ: పేద ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, టీడీపీకి నా రాక్తం ధారపోశా, పేదలకు ఇళ్లు ఇస్తామంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు, సీఎం జగన్‌కు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు-ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌
  • సీఎం జగన్‌ ఇది తొలిసారికాదు-మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. ప్రతిపక్ష నేత హోదా, సీఎం హోదాలో చాలా సార్లు వచ్చారు. ఎప్పుడు ఏ సాంప్రదాయం పాటిస్తారో ఇప్పుడూ అదే పాటిస్తారు. చంద్రబాబు, బీజేపీ నేతలు చెప్పారని సీఎం జగన్‌ ఏదీ చేయరు. సీఎం జగన్‌ ఎందుకు డిక్లరేషన్‌ ఇవ్వాలి. ప్రధాని మోదీతో కలిసి సీఎం జగన్‌ వెళ్లినప్పుడు ఎందుకు అడగలేదు. కులాలకు, మతాలకతీతంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారు. సీఎం హోదాలో తిరుమలకు వెళ్లి పట్టువస్త్రాలు సమర్పిస్తారు-మంత్రి వెల్లంపల్లి. దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠినంగా శిక్షిస్తాం. చిన్న చిన్న దేవాలయాల్లో కావాలని కుట్ర చేస్తున్నారు-మంత్రి వెల్లంపల్లి.
  • నిర్మల్: భైంసా మండలం కమోల్‌లో దగ్గర వాగులో చిక్కుకున్న యువకులు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా నీరు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 30 మేకలు, 10 గొర్రెలు. సాయం కోసం యువకుల ఎదురుచూపులు.
  • తిరుపతి: శేషాచలం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్న ఇద్దరు అరెస్ట్, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

ఉద్యోగం ఊడిందని.. గొయ్యి తవ్వుకుని..

Former Security guard, ఉద్యోగం ఊడిందని.. గొయ్యి తవ్వుకుని..

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన విజయ్‌కుమార్ ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఓ విచిత్రమైన పని చేశాడు. కొద్ది రోజుల నుంచి క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజు ఖాళీ ప్రదేశంలో తపస్సు చేసేందుకు సిద్దమయ్యాడు. అందుకోసం తనకు తాను సమాధి చేసుకునేందుకు గొయ్యి తవ్వుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విజయ్ కుమార్ ఉద్యోగం పోవడంతో.. మానసిక ఆందోళకు గురై ఇలా రకరకాల చేష్టలకు అలవాటు పడ్డాడు. మానసిక ఆందోళనతోనే ఈ విచిత్ర పనులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Related Tags