రాజ్యసభకు మన్మోహన్ సింగ్ నామినేషన్ దాఖలు

Manmohan Singh files nomination for Rajya Sabha, రాజ్యసభకు మన్మోహన్ సింగ్ నామినేషన్ దాఖలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన రాజ్యసభ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా రెండు నెలల క్రితం బీజేపీకి చెందిన సభ్యుడు మదన్‌లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానానికి ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.

కాగా 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 100మంది సభ్యుల బలం ఉంది. అలాగే 12మంది స్వతంత్ర్య సభ్యుల కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండటంతో మన్మోహన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *