కశ్మీర్‌లో మారణహోమం.. ట్వీట్లతో కౌంటర్ ఇచ్చిన భారత నెటిజన్లు!

Immaran Khan and Rehman Malik

ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం కశ్మీర్‌లో బీభత్సం సృష్టిస్తున్నారని  పాకిస్థాన్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత ఆర్మీ తూటాలకు కశ్మీర్‌లోని ప్రజలు తీవ్రంగా గాయపడ్డారంటూ చెబుతూ ఓ వీడియోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘భారత ఆర్మీ వల్ల కశ్మీర్ ప్రజలు చనిపోతున్నారని’ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, మానవ హక్కుల సంఘాలు కూడా ఒకసారి కశ్మీర్‌లో భారత ప్రభుత్వం చేస్తున్న మరణహోమాన్ని గమనించాలని అన్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం లోయలోని ప్రజలు స్వయం నిర్ణయాధికారాన్ని మాత్రమే కోరుతున్నారని ఆయన తెలిపారు.

అయితే దీనిపై భారత్‌లోని సీనియర్ జర్నలిస్ట్స్‌ పల్లవి ఘోష్, స్వాతి చతుర్వేదిలు స్పందిస్తూ.. మాలిక్ పోస్ట్ చేసిన వీడియో వట్టి నకిలీ ప్రచారమని కొట్టి పారేశారు. అలాగే మాలిక్ రిలీజ్ చేసిన వీడియోను ఖండిస్తున్నట్లుగా శ్రీనగర్‌లో జరుగుతున్న సాంసృతిక కార్యక్రమాన్నీ, అలాగే పిల్లలు సైనిక జవాన్లతో క్రికెట్ ఆడుతున్న వీడియోలను కూడా నెటిజన్లు, ఇతర ప్రముఖులు పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *