క్యాపిటల్ హిల్ ముట్టడిలో మాజీ ఒలంపిక్ స్విమ్మింగ్ చాంపియన్ కెల్లర్ ! ట్రంప్ మద్దతుదారుల్లో కలిసిపోయి..పోలీసులతో ఘర్షణ పడుతూ..

ఈ నెల 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ ముట్టడిలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారుల్లో మాజీ ఒలంపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ క్లేట్ కెల్లర్ కూడా ఉన్నాడని తెలిసింది.

  • Umakanth Rao
  • Publish Date - 4:45 pm, Wed, 13 January 21

ఈ నెల 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ ముట్టడిలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారుల్లో మాజీ ఒలంపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ క్లేట్ కెల్లర్ కూడా ఉన్నాడని తెలిసింది. గజ స్విమ్మర్ మైఖేల్ పెల్ప్స్ రిలే టీమ్ మేట్ అయిన కెల్లర్ లోగడ రెండు ఒలంపిక్ బంగారు పతకాలు సాధించాడు. యూఎస్ ఒలంపిక్ టీమ్ జాకెట్ ను ధరించిన ఇతడిని వీడియోలో గుర్తించినట్టు స్విమ్మింగ్ మ్యాప్ వెబ్ సైట్ స్విమ్ స్వామ్ తెలిపింది. పోలీసులతో ఘర్షణ పడుతూ ఇతడు ముందుకు దూసుకుపోవడాన్ని గమనించామని ఈ సైట్ పేర్కొంది. కానీ భారీ సంఖ్యలో ఉన్న గుంపులో ఇతడిని తాము గుర్తించిన దాఖలాలు లేవని యుఎస్ఎ స్విమ్మింగ్ విభాగం మాత్రం తెలిపింది. దీన్ని ధృవీకరించలేమని పేర్కొంది.

ట్రంప్ మద్దతుదారుల్లో పలువురు  మాజీ అథ్లెట్లు కూడా ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. క్యాపిటల్ హిల్ ముట్టడి సందర్భంగా జరిగిన అల్లర్లలో అయిదుగురు మృతి చెందారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా మళ్ళీ  ఆ విధమైన ఘటనలు జరగకుండా చూసేందుకు ట్రంప్ తాజాగా వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ విధించారు.

Read Also:ట్రంప్ ర్యాలీలో భారత జాతీయ పతాకం ఎగురవేసిన వ్యక్తి ఈయనే ! తప్పు లేదంటున్న డొనాల్డ్ అభిమాని.