Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ఏపీలోకి సీబీ’ఐ’ రీ ఎంట్రీ..యరపతినేనిదే మెుదటి కేసు!

టీడీపీ నేత యరపతినేనిపై దాఖలైన అక్రమ మైనింగ్​ కేసును.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లోని సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేసిన సీఐడీ విభాగం… దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సీబీఐకి పంపింది. ఈ కేసు సీబీఐ విచారణకు సంబంధించిన నోటిఫికేషన్​ను జారీ చేస్తున్నట్టు రాష్ట్ర హోంశాఖ పేర్కోంది. రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతి (జనరల్‌ కన్సెంట్‌) పునరుద్ధరణ అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు తొలికేసు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టైంది. ఇదే సమయంలో కేంద్రం సీబీఐకి అప్పగించేందుకు వీలుగా కావాల్సిన సమాచారం..కోర్టులో జరగిన ప్రొసీడింగ్స్.. రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులతో కూడిన పూర్తి నివేదికను కేంద్ర హోం శాఖకు ఏపీ ప్రభుత్వం అందచేసింది.

గతంలో చంద్రబాబు హాయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఉత్తర్వులను రద్దు చేసి..తిరిగి సీబీఐకి అవకాశం కల్పించారు.