డబ్బులు కట్టి విదేశాలకు వెళ్తున్నారు..ఈయనా ‘సీఎం‌’ ? : యనమల

Former Minister Yanamala Ramakrishnudu Sensational Comments on AP CM Jagan, డబ్బులు కట్టి విదేశాలకు వెళ్తున్నారు..ఈయనా ‘సీఎం‌’ ? : యనమల

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈమేరకు సీబీఐ అనుమతినిచ్చింది. దీంతో.. ఆగష్టు 1 నుంచి 25 వరకూ జగన్ అమెరికాలో పర్యటించబోతున్నారు. అటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అమెరికా వెళ్లేందుకు సీబీఐ నుంచి అనుమతి లభిందించింది. అయితే.. విజయసాయి రెడ్డి రూ.2 లక్షలు డిపాజిట్ కట్టి విదేశాలకు వెళ్లాలని కోర్టు తీర్పునిచ్చింది.

కాగా.. సీఎం జగన్, విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రమైన ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి పొందాల్సి రావడం రాష్ట్రానికి తలవంపులు కాదా..? ఫోన్ నెంబర్లు ఇచ్చి విదేశాలకు వెళ్లాలని కోర్టులే మన సీఎంను ఆదేశించాల్సి రావడం ఏపికి అప్రదిష్ట కాదా..? ఇక విజయసాయి రెడ్డి గారిని అయితే రూ.2లక్షలు డిపాజిట్ కట్టి విదేశాలకు వెళ్లమని కోర్టు చెప్పిందట ..ఇటువంటి వైసిపి నేతల నోటివెంట శ్రీరంగ నీతులు వినాల్సి వస్తోంది. ఎంపిలుగా ఎన్నికైంది నిందితుల ప్రయోజనాల కోసమా..? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నికయ్యారా..? అని ప్రశ్నించారు యనమల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *