రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఏం చేద్దాం..?

TDLP Meeting, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఏం చేద్దాం..?

ఉండవల్లిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. దీంతో పాటు ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపైనా సమీక్ష జరపనున్నారు. ఇప్పటికే తరుచూ పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటమితో నిస్తేజంగా ఉన్న పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని సీనియర్లకు చంద్రబాబు సూచిస్తున్నారు.

కాగా.. కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. కరువు ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టులను ఆపేయడం సరికాదన్నారు. పీపీఏలను రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించారు. తదితర అంశాలన్నింటినీ అసెంబ్లీలో లేవనెత్తేలా పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *