Breaking News
  • ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. వర్షాలతో ఇసుక కొరత ఏర్పడింది. అప్పుడే దీక్షలు ఎందుకు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించలేకపోతున్నారు-వంశీ
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

పరారీలో భూమా అఖిల ప్రియ భర్త..! పోలీసుల గాలింపు..!

Hyderabad police filed case on AP former minister Akhilapriya husband Bhargavram

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ కోసం ఆళ్లగడ్డ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత రెండ్రోజులుగా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఓ పోలీసుపై కారును పోనిచ్చాడన్న కేసులు కూడా భార్గవరామపై నమోదయ్యాయి. ప్రస్తుతం ఆళ్లగడ్డ పీఎస్‌లో రెండు కేసులు, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు నమోదు అయ్యాయి.

రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లో భార్గవరామను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కారును ఆపినట్లే ఆపి.. ఆ తర్వాత వేగంగా కారును డ్రైవ్ చేసుకుని వెళ్లాడని ఆళ్లగడ్డ ఎస్‌ఐ అంటున్నారు. అంతేకాదు కారును తమపైకే పోనిచ్చాడని ఎస్‌ సోమేష్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ అఖిలప్రియ భర్త కోసం గాలింపును ముమ్మరం చేసింది. ప్రస్తుతం అతనిపై ఐపీసీ సెక్షన్‌ 353, 336 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.