Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

విదేశాలకు పారిపోయిన భూమా అఖిల ప్రియ భర్త..?

Former Minister Bhuma Akhila Priya's Husband Bharagav Ram Case Updates, విదేశాలకు పారిపోయిన భూమా అఖిల ప్రియ భర్త..?

టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్‌ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఆయన సంబంధీకులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే.. గ్రీస్‌లో ఉన్నామని ఫోన్‌ పెట్టేసినట్లు వారి సన్నిహితులు చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భార్గవరామ్‌పై ఆళ్లగడ్డ, హైదరబాద్‌లలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

భార్గవరామ్ తన బిజినెస్ పార్ట్‌నర్‌పై దాడి చేసినట్లు భార్గవరామ్‌పై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి, అఖిలప్రియలు క్రషర్ ఫ్యాక్టరీలో భాగస్వాములు. తర్వాత వ్యాపార లావాదేవీల్లో వివాదం మొదలయ్యింది. ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవరామ్ తన భర్తపై హత్యాయత్నం చేశారని శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవరామ్‌తో పాటు మరో 10 మందిపై కూడా కేసు నమోదయ్యింది.

అయితే ఈ కేసుల విచారణలో భాగంగా భార్గవరామ్‌ను పట్టుకునేందుకు ఆళ్లగడ్డ పోలీసులు హైదరాబాద్‌ వచ్చారు. ఈ క్రమంలో భార్గవరామ్ పోలీసులకు కనిపించారని.. కారును ఆపినట్లే ఆపి.. ఆ తర్వాత వేగంగా కారును డ్రైవ్ చేసుకుని వెళ్లాడని ఆళ్లగడ్డ ఎస్‌ఐ పేర్కొన్నారు. అంతేకాదు కారుతో తమనను ఢీకొట్టేందుకు ప్రయత్నించారని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు (అక్టోబర్ 8) ఐపీసీ సెక్షన్లు 353, 336 కింద భార్గవరామ్‌పై కేసు నమోదు చేశారు. భార్గవరామ్‌పై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు ఓ వైపు ఆయన కోసం హైదరాబాద్‌తో సహా పలు చోట్ల విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆయన సన్నిహితుల చెప్తున్న సమాచారంతో భార్గవ రామ్‌ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే సన్నిహితులు చెప్తున్నట్లుగా విదేశాల్లో ఉన్నారా..? లేక ఇండియాలోనే ఉన్నారా..? అన్నది పోలీసులు తేల్చాలి.