దీదీకి షాక్… బీజేపీలోకి అత్యంత సన్నిహితుడు!

Former Kolkata Mayor And Top Mamata Banerjee Aide Sovan Chatterjee Joins BJP

కోల్‌‌కతాలో అధికార టీఎంసీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. టీఎంసీని బలహీనపరిచే క్రమంలో బీజేపీ దూసుకుపోతోంది. అందులో భాగంగానే సీఎం మమతా బెనర్జీకి కుడి భుజంగా ఉన్న సావన్ ఛటర్జీని బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. సీనియర్ నేత ముకుల్ రాయ్, ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ నేతృత్వంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

టీఎంసీకి వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఘోరంగా ఓడిస్తామని ముకుల్ రాయ్ పునరుద్ఘాటించారు. సావన్ ఛటర్జీ… టీఎంసీలో కీలక నేత. కోల్‌కతా మేయర్‌గా కూడా కొనసాగారు. అంతేకాకుండా మమత ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మమత బెనర్జీకి కుడిభుజం లాంటి సావన్ ఆమె సీఎం కావడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *