బాబు అవినీతిపై రిటైర్డ్ జస్టిస్ తీవ్ర విమర్శలు

Former Justice Eeshwarayya Sensational Comments On TDP Leaders, బాబు అవినీతిపై రిటైర్డ్ జస్టిస్ తీవ్ర విమర్శలు

అభివృద్ధి ముసుగులో టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుందని రిటైర్డ్ జిస్టిస్ ఈశ్వరయ్య ఫైర్ అయ్యారు. రాజధాని నిర్మాణం పేరుతో విపరీతంగా దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. వారు చేసిన తప్పులు బయటపెడుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి చిట్టాను బయటపెడుతుంటే ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోందని విమర్శించారు. విచారణ కమిటీలు, విజిలెన్స్ దర్యాప్తులు వేస్తుంటే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వం చారిత్రాత్మక బిల్లులు పాస్ చేయించి చరిత్రలో నిలిచిపోయిందని జస్టిస్ ఈశ్వరయ్య కొనియాడారు. నిధులు నియామకాల్లో వెనకబడిన తరగతుల వారికి, ఎస్సీ ఎస్టీ, మైనార్టీలకు , మహిళలకు 50 శాతం కేటాయిస్తూ ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని ఆయన ప్రశంసించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన ఏకైక నాయకుడు జగన్ అని తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *